World Cup 2023: సీట్లపై కాకి రెట్టలు.. ఫ్యాన్స్‌కి ఒళ్లు మండేలా చేసిన బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్ తుస్సు! ప్రపంచ కప్ ప్రారంభం అయ్యింది. కానీ ఆ కిక్ మాత్రం ఎక్కడా కనపడడంలేదు. తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులు లేక బోసిపోయింది. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఇది. మహిళలకు ఫ్రీ టికెట్లు కూడా ఆఫర్ చేసినా ఎవరూ స్టేడియంవైపు రాలేదు. వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచ్‌ని ఇలాగేనా నిర్వహించేదని బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Trinath 05 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి England vs NZ: ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం నరేంద్ర మోదీ గ్రౌండ్. అందుకే వరల్డ్ కప్(World cup) తొలి మ్యాచ్ అక్కడ నిర్వహించింది బీసీసీఐ(BCCI). 2019 వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు టికెట్లు అమ్ముడుపోలేదు. దీంతో ఫ్రీ టికెట్లు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 40వేల మంది మహిళలు స్టేడియానికి వస్తారని ప్రచారం చేశారు. అయితే సీన్ చూస్తే మాత్రం ప్రేక్షకుల సంఖ్య నిల్‌గా కనిపిస్తోంది. అక్కడఅక్కడ కొంతమంది అభిమానులు కనిపిస్తున్నారనే కానీ అసలు వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచ్ అన్న ఫీల్ ఎక్కడా కనిపించడంలేదు. ఆ వచ్చిన ఫ్యాన్స్ కూడా 'మోదీ మోదీ' అని నినాదాలు చేస్తుండడం షాక్‌కి గురిచేస్తోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఆడుతుంటే మధ్యలో మోదీ నినాదాలు ఎందుకో అర్థం అవ్వక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బీసీసీఐపై మండిపడుతున్నారు. వరల్డ్‌కప్‌ని ఇలానేనా ఆర్గనైజ్ చేసేది అని ఫైర్ అవుతున్నారు. అసలే క్రికెట్‌ని మతంగా భావించే దేశం మనది. ఏ చిన్న తప్పు జరిగినా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అయినా కూడా బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Picture 1: BJP promised to gather 40000 women for the first WC match at Narendra Modi stadium. They even distributed free tickets. Picture 2: Only 100 people have turned up for the match. This proves only one point that people don’t believe in Modi and BJP now, they have… pic.twitter.com/EJ2PNxTrBd — Dr Nimo Yadav (@niiravmodi) October 5, 2023 The seat that costs 2K in Ahemdabad's Narendra Modi Stadium. That can be one of the reasons for the crowds not turning up. (Picture via Sourabh Pareek)#ENGvNZ pic.twitter.com/jEf5wDCpho — Himanshu Pareek (@Sports_Himanshu) October 5, 2023 The cricket World Cup has started and the stadium is empty on the first match itself. Modi and Shah are ruining India while Jay Shah is destroying Indian cricket. pic.twitter.com/hNZFWSSK1p — Shantanu (@shaandelhite) October 5, 2023 Wow beautiful scenes at Narenda Modi Stadium, Ahmedabad, house full 🤩#ENGvsNZ #icccricketworldcup2023 #ENGvNZ https://t.co/2ch7Fn341T pic.twitter.com/1DQIlozVTm — Maham Gillani (@DheetAfridian) October 5, 2023 These pictures are looking so ugly, completely empty stadium just before the first ball 👀 This is actually so, so bad! They ruined the first World Cup match. Not sure why they gave this match to Gujarat's state which has no cricket culture 🤦🏼♂️🤦🏼♂️ #CricketWorldCup2023 #CWC23 pic.twitter.com/bhm7jDuhPA — Farid Khan (@_FaridKhan) October 5, 2023 A completely empty stadium in Ahmedabad for the opener of the biggest event in cricket https://t.co/htswz9ue7x pic.twitter.com/Dq8tOUfhAU — yang goi (@GongR1ght) October 5, 2023 ఇలా జరిగిందేంటి బ్రో? అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్ లో ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. 1,32,000 సామర్థ్యంతో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ ప్రారంభ మ్యాచ్ కు లక్షకు పైగా సీట్లు ఖాళీగా కనిపించాయి. 'ఆ ఖాళీ సీట్లన్నింటినీ చూడండి. టీవీల్లో భయంకరంగా కనిపిస్తోంది. హోస్ట్ ఎల్లప్పుడూ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడాలి. ఫైనలిస్టులు మరుసటి రోజు ఆడవచ్చు.' అని కామెంట్ చేస్తున్నారు. ఇండియానే తొలి మ్యాచ్‌తో ఓపెనింగ్ చేసి స్టేడియం నిండిపోయి ఉండేది. బీసీసీఐకి ఈ విషయం తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఓపెనింగ్ సెరమనీ కూడా లేదని మరికొంతమంది నిలదీస్తున్నారు. మహిళల మాటేంటి? 'ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ లో ఇన్ని సీట్లు ఖాళీగా ఉండటం నిజంగా సిగ్గుచేటు. రాఫ్టర్లకు ప్యాక్ చేయాలి." అని మరొక అభిమాని కామెంట్ చేశాడు. తొలి మ్యాచ్ కు టికెట్లు అమ్ముడుపోకపోవడంతో అహ్మదాబాద్ కు చెందిన సుమారు 30 వేల నుంచి 40 వేల మంది మహిళలకు ఉచిత టికెట్లతో పాటు టీ, లంచ్ కు ఉచిత వోచర్లను నిర్వాహకులు ఆఫర్ చేశారు. బోడక్ దేవ్ ప్రాంతానికి చెందిన బిజెపి ఉపాధ్యక్షుడు లలిత్ వాధ్వాన్ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'(Indian express) తో మాట్లాడుతూ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు నుండి ప్రేరణ పొంది ఈ డ్రైవ్ జరిగిందని చెప్పారు. అహ్మదాబాద్ నుంచి 40 వేల మంది మహిళలు స్టేడియంలో మ్యాచ్ ను వీక్షించనున్నారని.. మా వాలంటీర్ల పేర్లను పంపించాలని కోరగా వారికి టిక్కెట్లు అందజేశారన్నారు. ఈ మహిళలే స్వయంగా స్టేడియానికి చేరుకుంటారని, వారికి టీ, ఫుడ్ కూపన్లు ఇస్తామని వాధ్వాన్ తెలిపారు. అయితే టీ లేదు, ఫుడ్ కూపన్లు లేవు కానీ సీట్లపై కాకి రెట్టలు మాత్రం కనిపిస్తున్నాయని ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ALSO READ: ఒకడు తోపు..ఇంకోడు తురుము.. ది గ్రేట్ ఖలీ, రోహిత్ శర్మ ఫొటో వైరల్..! CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL #icc-world-cup-2023 #england-vs-newzealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి