Ind vs Aus: రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోని ఆడాడా? 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమికి కారణం అదేనా?

ప్రపంచ కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 8) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డ పాత మ్యాచ్‌లను గుర్తుచేసుకుంటున్నారు. 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఇండియా ఓటమికి ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోవడమే కారణమన్న ప్రచారం ఉండగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

New Update
Ind vs Aus: రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు పెట్టుకోని ఆడాడా? 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమికి కారణం అదేనా?

రేపు(అక్టోబర్ 8) ఇండియా(India) వర్సెస్ ఆస్ట్రేలియా(Australia) మ్యాచ్‌ జరగనుంది. చెన్నై(Chennai) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ ఇండియాతో పాటు ఆస్ట్రేలియాకు కూడా ఈ ప్రపంచ కప్‌(world cup)లో తొలి మ్యాచ్‌. ఫస్ట్ మ్యాచ్‌ విక్టరీతో లీగ్‌ను ప్రారంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇరు జట్లు బలంగా ఉండడంతో క్రికెట్ లవర్స్‌కు ఈ మ్యాచ్‌ అసలుసిసలైన కిక్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్‌లో జరిగిన పాత మ్యాచ్‌లను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా 2003 ప్రపంచ కప్‌ ఫైనల్‌ టీమిండియా అభిమానులకు ఇప్పటికీ ఓ పీడకలలానే ఉంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి రికీ పాంటింగ్‌(Ricky ponting) చీట్ చేయడమే కారణం అని చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ రికీ పాంటింగ్ ఏం చేశాడు.

అసలేం జరిగింది.
మార్చి 23, 2003.. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ గంగూలీ ఊహించని విధంగా బౌలింగ్‌ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి ఓవర్‌ నుంచి ఇండియా బౌలర్లపై డామినేషన్‌ ప్రదర్శించారు. జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రాను ఓ ఆటాడుకున్నారు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ ఈ ఫైనల్‌లో ఆడిన ఆట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌నే అంటారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌.

స్ప్రింగ్‌లు వాడడా?
74 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పాంటింగ్‌ తర్వాత చెలరేగి ఆడాడు. మొత్తంగా 121 బంతుల్లో 140 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాంటింగ్‌ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు ఉన్నాయి. 360 రన్స్ టార్గెట్‌గా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 234పరుగులకే ఆలౌట్ అయ్యింది. సచిన్ తొలి ఓవర్‌లోనే అవుట్ అవ్వడం టీమిండియా కొంపముంచింది. అయితే ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ తర్వాత పాంటింగ్‌ ఆడిన ఆటపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంత ఈజీగా సిక్సులు ఎలా కొట్టాడని ఇండియా ఫ్యాన్స్‌ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారం రోజులకు ఓ పెద్ద న్యూస్‌ చక్కర్లు కొట్టింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో పాంటింగ్‌ తన బ్యాట్‌కి స్ప్రింగ్‌ పెట్టుకోని వచ్చాడని.. బ్యాట్‌ మధ్యలో స్ప్రింగ్‌ ఉండడంతోనే ఈజీగా రన్స్‌ చేవాడని ఆ వార్త సారాంశం. సోషల్‌మీడియా ఎక్కువగా లేని కాలంలో వచ్చిన ఆ న్యూస్‌ ఆ నోటా ఈ నోటా పడి వేగంగా వ్యాపించింది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఏప్రిల్ 1st సందర్భంగా క్రియేట్ చేసిన న్యూస్ అది. నిజానికి పాంటింగ్‌ ఏ స్ప్రింగ్‌లూ బ్యాట్‌లో పెట్టుకోలేదు.

ALSO READ:  ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు