IND vs AUS: ఏపీ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ న్యూస్‌.. మ్యాచ్‌ చూసేందుకు పెద్ద స్క్రీన్లు.. ఫ్రీ ఎంట్రీ!

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఏసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేయగా.. అందరికీ ఉచిత ప్రవేశం ఇస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి చెప్పారు.

New Update
IND vs AUS: ఏపీ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ న్యూస్‌.. మ్యాచ్‌ చూసేందుకు పెద్ద స్క్రీన్లు.. ఫ్రీ ఎంట్రీ!

ICC WORLD CUP 2023: ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 19న భారత్‌– ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ను అభిమానులు పెద్ద స్క్రీన్ల (ఫేన్‌ ఎరీనా) పై తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్‌ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు. అక్కడ ఫుడ్‌ కౌంటర్లు ఉంటాయన్నారు. పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

పెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేసే స్థలం జిల్లాల వారీగా..
1. విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)
3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం
8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్
12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం.

Also Read: అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి.. ప్రపంచాన్ని జయించి..! తలరాతను మార్చిన వీరులు వీరే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు