నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3వేల బ్యాంక్‌ జాబ్స్‌కి నోటిఫికేషన్‌ రిలీజ్‌.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి..!

మరోవైపు IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం కూడా నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21. IBPS PO ప్రిలిమ్స్‌ పరీక్ష సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జరగనుండగా.. మెయిన్స్‌ ఎగ్జామ్‌ నవంబర్‌లో జరగనుంది.

New Update
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3వేల బ్యాంక్‌ జాబ్స్‌కి నోటిఫికేషన్‌ రిలీజ్‌.. డీటైల్స్‌ చెక్‌ చేసుకోండి..!

IBPS PO MT Notification: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CRP-PO/MT-XIII రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 1న ప్రారంభమవగా.. ఆగస్ట్ 21న ముగుస్తుంది. IBPS POకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ click here ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్‌లో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 2023లో జరగనుంది.

IBPS PO/MT ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT)

పోస్టుల సంఖ్య: 3,049

కేటగిరీ వారీగా పోస్టులు

ఎస్సీ - 462

ఎస్టీ - 234

ఓబీసీ - 829

ఈడబ్ల్యూఎస్‌ - 300

యూఆర్(UR) - 1,224

⦿ ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విండో - ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21వరకు
కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్ - సెప్టెంబర్
IBPS PO పరీక్ష (ప్రిలిమినరీ) - సెప్టెంబర్ లేదా అక్టోబర్
IBPS PO పరీక్ష(మెయిన్స్) నవంబర్

విద్యా అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం(Recognized university)  నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయసు: అభ్యర్థి తప్పనిసరిగా ఆగష్టు 2, 1993 తర్వాత పుట్టి ఉండాలి.. ఆగష్టు 1, 2003 తర్వాత పుట్టిన వాళ్లు అనర్హులు. అంటే ఏజ్‌ లిమిట్‌ 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్ 1 - Official Website ibps.in సైట్‌కి వెళ్లండి

స్టెప్ 2 - హోమ్‌పేజీలో(Home Page) రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్‌ 3 - ఫారమ్‌ను పూరించండి

స్టెప్ 4 - ఫీజు చెల్లించండి

స్టెప్ 5 - కన్‌ఫర్‌మేషన్‌ పేజీని డౌన్‌లోడ్ చేసుకోని ఉంచుకోండి

ఫీజ్‌: SC, ST, PwBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 850.

అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

IBPS SO:
మరోవైపు IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం కూడా నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21. IBPS PO ప్రిలిమ్స్‌ పరీక్ష సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జరగనుండగా.. మెయిన్స్‌ ఎగ్జామ్‌ నవంబర్‌లో జరగనుంది.

IBPS SO 2023 ఖాళీల వివరాలు:

అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I): 500

HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I): 31

ఐటీ అధికారి(స్కేల్-I): 120

లా ఆఫీసర్ (స్కేల్-I): 10

మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 700

మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 41

IBPS SO రిక్రూట్‌మెంట్ 2023 గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు click here  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. IBPS SO 2023 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ డిసెంబర్ 30, 31న జరుగుతుంది. మెయిన్‌ ఎగ్జామ్‌ 2024 జనవరిలో జరుగుతుంది.

Also Read: గ్రూప్ 1 ఫైనల్ కీ ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు