Smitha Sabharwal IAS: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్!

ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదంటూ తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
Smitha Sabharwal IAS: ఆ రిజర్వేషన్లపై దుమారం రేపిన స్మితా సబర్వాల్ కామెంట్స్.. నెట్టింట బిగ్ డిబేట్!

Smitha Sabharwal IAS: పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి నకిలీ వైకల్యం సర్టిఫికెట్ తో సివిల్స్ సర్వీస్ ఉద్యోగంలో ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలంటూనే ఆల్ ఇండియా సర్వీసులలో వారికి కోటా ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎక్స్ వేదికగా ఆమె చేసిన వరుస ట్వీట్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని డెస్క్ లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.

వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా?
ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంపై స్మితా స్పందిస్తూ.. బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని, అవకతవకలు తేల్చకుండా తప్పించుకోలేరంటూ పోస్టు చేశారు. 'వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నా. సివిల్ సర్వీస్ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాల స్వభావం ఫీల్డ్ వర్క్, ఎక్కువ సమయం కేటాయించడం, ప్రజల మనోవేదనలు నేరుగా వినాల్సి ఉంటుంది. దీనికి శారీరక దృఢత్వం అవసరం. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్స్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా?’ అని స్మితా ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ ఈ ఉద్యోగుల పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. దీంతో స్పందించిన స్మిత.. ఇవ్వకూడదు అని బదులిచ్చారు. మరో నెటిజన్ స్పందిస్తూ నేను లోకోమోటర్ డిజేబుల్డ్, అంప్యూటీని. నేను ఒంటరిగా 4 దేశాలు తిరిగాను. నేను దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. అలాగే నేను వ్యాపారం నడుపుతున్నాను, నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను ఈత కొడుతున్నా. నేను ఊతకర్రలతో నడుస్తా. కానీ మోడ్రన్ డేస్ ఐఏఎస్, ఐపీఎస్ లు చాలా మంది సేవలో లేరు. వారు తమను తాము రాజులుగా, రాణులుగా పరిగణించుకుంంటూ సివిల్ సర్వెంట్లమని మరచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారంటూ విమర్శించారు. ఇందుకు హ్యాట్సాప్ అని స్మితా సబర్వాల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటూ రిప్లయ్ ఇచ్చారు. అయితే స్మితా సబర్వాల్ ట్వీట్లపై నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు విభిన్న రీతుల్లో రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది స్విత వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

నేనేమి పరిమిత అనుభవంతో మాట్లాడటం లేదు..
స్మితా సబర్వాల్ లేవనెత్తిన అంశాలపై శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఇది చాలా దయనీయమై వినహాయింపు కలిగిన అభిప్రాయం అని విమర్శించారు. బ్యూరోక్రాట్ లు తమ పరిమితమైన ఆలోచనలను వారి ప్రత్యేకాధికారాలను ఎలా చూపిస్తున్నారనేదానికి నిదర్శనం అని అన్నారు. ప్రియాంక వ్యాఖ్యలకు స్పందించిన స్మితా సబర్వాల్ ‘మేడం బ్యూరోక్రాట్లు పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. నేనేమి పరిమిత అనుభవంతో మాట్లాడటం లేదు. 24 ఏళ్ల నా ఉద్యోగ అనుభవంతోనే నా ఆలోచనలను, ఆందోళనలను పంచుకున్నాను. దయచేసి పూర్తిగా చదవండి. ఇతర కేంద్ర సేవలతో పోలిస్తే ఐఏఎస్ కు భిన్నమైన డిమాండ్లు ఉన్నాయి. ప్రతిభావంతులైన వైకల్యం కలిగిన వారు కచ్చితంగా గొప్ప అవకాశాలు పొందవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు.

బాగా సరిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నా..
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.కరుణ మాత్రం వైకల్యం గురించి ఐఏఎస్ ఆఫీసర్ కు అవగాహన లేదని విమర్శించారు. చాలా వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవు. కానీ మీ ట్వీట్ జ్ఞానోదయం, వైవిధ్యం చాలా అవసరం అని చూపిస్తుందన్నారు. దీనిపై రియాక్ట్ అయిన స్మితా సబర్వాల్.. 'మేడం నాకు ఉద్యోగ అవసరాల గురించి ప్రాథమిక అవగాహన ఉంది. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్ కు అనుకూలత గురించి. డెస్క్ ట్యాంక్ స్వభావం వంటి ప్రభుత్వంలోని ఇతర సేవలు బాగా సరిపోతాయని నేను గట్టిగా నమ్ముతున్నా. దయచేసి ముగింపు వెళ్లవద్దు. సమానత్వ హక్కుల కోసం మొత్తం రక్షణ కోసం చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ఉంది. అక్కడ ఎలాంటి చర్చ లేదు' అంటూ వివరించారు. మొత్తంగా స్మిత సబర్వాల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

#all-india-service-job-reservation #ias-smita-sabharwal
Advertisment
Advertisment
తాజా కథనాలు