BRS Chief KCR : వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100 శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాలు రాబోతున్నాయని అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.

New Update
KCR: నా బిడ్డ జైలులో ఉంటే బాధగా ఉండదా.. అగ్నిపర్వతంలా ఉన్నా: కేసీఆర్

KCR Will Be In The PM Race : పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్(KCR) ప్రధాని రేసులో ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటా అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు.కేసీఆర్ అంటే తెలంగాణ ఎమోషన్ అన్నారు. మా పాలన విధ్వంసం అంటే వాళ్ల కంటే మూర్ఖులు లేరన్నారు. ప్రభుత్వం దగ్గర సూట్ కేసులో డబ్బులు ఉండవని.. ప్రతిరోజూ డబ్బులు జెనరేట్ అవుతాయన్నారు. బీజేపీ(BJP) దేవుడి పేరు చెప్పి ఓట్లు దొబ్బిపోయే పార్టీ అన్నారు. ముస్లింలపై ద్వేషంతో రిజర్వేషన్లు తీసేస్తామంటే కుదరదన్నారు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. మాకు నివేదికలు ఇస్తారు అంతే అన్నారు. వాళ్లు ఎలా నివేదికలు ఇస్తారో సీఎంకు అవసరం లేదని.. గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వాలు ఉండవని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. రోజూ సీఎంకు మార్నింగ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుందన్నారు. ప్యారగాన్ చెప్పులు వేసుకున్నది, కబ్జాలు చేసింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

బీఆర్‌ఎస్‌కే అత్యధిక స్థానాలు..

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవబోతోంది.. రెండు జాతీయ పార్టీలను మించి బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చాలా తప్పులు చేశారు.. ప్రభుత్వాలు మారితే.. గత ప్రభుత్వం కంటే బాగా పనిచెయ్యాలి.. కానీ.. అనేక ముఖ్య విషయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయాలు చేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలంటూ ప్రతిపక్షాలను తూలనాడారు.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అతి తక్కువ సమయం కేటాయించారంటూ పేర్కొన్నారు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.. అది కాంగ్రెస్‌ను ముంచెయ్యబోతోంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న జోష్‌.. కాంగ్రెస్‌లో ఇప్పుడు లేదని కేసీఆర్ అన్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. సొంతూళ్లకు పయనం

రేవంత్‌ పిచ్చి సీఎం..

రాష్ట్రం దివాళా తీసిందని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పరు.. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నింట్లో విఫలమైంది .. కరెంట్ కోతలకు తెలంగాణను నిలయంగా చేసిందన్నారు. తాను నైట్ హాల్ట్ చేసిన సమయంలో ఏడెనిమిది సార్లు కరెంట్ పోయేది.. కరెంట్‌ను ఎందుకు దెబ్బతీశారో కాంగ్రెస్‌ చెప్పాలంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పక్కకు జరగగానే కట్క బంద్ అయినట్లు కరెంట్ పోయింది.. హైదరాబాద్‌లో చిన్న వర్షానికే ఐదారు గంటలు కరెంట్ పోయిందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు