Hydra: మరింత బలంగా హైడ్రా.. అధికార పరిధి పెంపు.. సిబ్బంది కేటాయింపు!

చెరువులు, నాలాల పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా పరిధిని విస్తృతం చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో అన్ని చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఇకపై నోటీసుల దగ్గర నుంచి కూల్చివేతల వరకూ అన్నీ హైడ్రా ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. 

New Update
BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!

Hydra: తనకున్న లిమిటెడ్ పరిధిలోనే హైడ్రా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హైడ్రాకు ప్రభుత్వం మరిన్ని అధికారాలను అప్పచెబుతోంది. ఇప్పటివరకూ జలమండలి పరిధిలోని గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణను ఇకపై హైడ్రా పరిధిలోకి తీసుకురాబోతున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు  పరిధిలోని అన్ని చెరువులు, పేరుకులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించే బాధ్యతలూ హైడ్రాకే అప్పగించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే నోటీసులు ఇవ్వడం దగ్గర నుంచి అవసరమైతే కూల్చివేసే వరకూ కూడా అన్ని నిర్ణయాలూ హైడ్రా కనుసన్నల్లోనే జరిగేలా విధానాలను రూపొందిస్తోంది ప్రభుత్వం. పూర్తి అధికారాలు హైడ్రా కు అప్పగించడం ద్వారా భవిష్యత్ లో కోర్టు చిక్కులు.. ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. 

Hydra: ఈమేరకు హైడ్రాకు ఫుల్ పవర్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సెక్రటేరియట్ లో వెల్లడించారు. హైడ్రాపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇప్పటివరకూ ఆక్రమణలపై నోటీసులు ఇస్తున్న విధానాన్ని మార్చాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఇటువంటి ఆక్రమణలపై వివిధ విభాగాలు అంటే పంచాయతీరాజ్, జలమండలి, జీహెచ్ఎంసి వంటివి విడివిడిగా నోటీసులు ఇస్తూ వస్తున్నాయి. ఇప్పటి నుంచి అలా కాకుండా హైడ్రా ఆధ్వర్యంలోనే నోటీసులను జరీ చేసేలా చర్యలు తీసుకోవాలని దీనికోసం విధి విధానాలు రూపొంచాలని శాంతి కుమారి మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. అలాగే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్, వాల్టాల వంటి అన్ని చట్టాల పరిధిలో జరీ చేసే అన్ని నోటీసులు, తొలగింపులు ఒకే చోట నుంచి అంటే, హైడ్రా ద్వారా మాత్రమే జరిగేలా ఏర్పాటు చేయన్నున్నట్టు సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. 

Hydra: ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో 72 బృందాల ఏర్పాటు జరిగిందనీ.. వీటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ చెప్పారు. దీనికోసమే పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులను వేగంగా కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రివ్యూ సమావేశంలో  హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు అనుదీఫ్, శశాంక లతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ పౌత్రు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు