Hydra: నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ TG: హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన అధికారులు.. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చనున్నట్లు సమాచారం. బఫర్ జోన్‌లో కాలేజీ భవనాలు నిర్మించారని ఆయనపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 25 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hydra: హైడ్రా కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొడుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. నిన్న మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు అధికారులు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలపై నాజర్ వేశారు హైడ్రా అధికారులు. నాదం చెరువు బఫర్ జోన్‌లో పల్లా కాలేజీ భవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పల్లా అనురాగ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలు, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనాలపై హైడ్రకు ఫిర్యాదులు అందాయి. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్‌లోని పల్లా కాలేజీలు ఉన్నాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో నిర్మించారంటూ పోలీసులకు AEE పరమేష్ ఫిర్యాదు చేశారు. రెండు కాలేజీ భవనాలు అక్రమంగా నిర్మించారని గుర్తించారు. పల్లా కాలేజీలపై కేసు నమోదు చేశారు ఘట్‌కేసర్ పోలీసులు. ఘట్‌కేసర్ వెంకటాపురం 813 సర్వే నెంబర్ లో నాదం చెరువు ఉంది. 61 ఎకరాల్లో విస్తరించిన నాదం చెరువు కింద భవనాలు వెలిసాయి. చెరువు వెంబడి 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉంది. అనురాగ్, గాయత్రి ట్రస్ట్ నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. హైడ్రా యాక్షన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి