HYDRA: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత!

హైదరాబాద్‌లో అక్రమానిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌ ఆదేశాలతో బాచుపల్లి ఎర్రకుంట చెరువును కబ్జా చేసి కట్టిన అపార్ట్‌మెంట్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

New Update
HYDRA: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత!

HYDRA: హైదరాబాద్‌ చెరువుల్లో ఆక్రమణలు కూల్చివేత పనులు మొదలు పెట్టింది GHMC. ఈ క్రమంలో ఈరోజు బాచుపల్లి ఎర్రకుంట చెరువు పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రగతినగర్‌ - బాచుపల్లి ఎర్రకుంటలో సర్వే నెంబర్‌ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. చెరువును ఆక్రమించి మాప్స్‌ కనస్ట్రక్షన్‌ నిర్మాణం జరిగింది. 1300 గజాల్లో అపార్ట్‌మెంట్‌ను ఓ సంస్థ నిర్మించింది. నిన్న సాయంత్రం ఆక్రమణలను పరిశీలించారు హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌. బిల్డింగ్‌లను కూల్చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి కూల్చివేత కొనసాగుతోంది.

Also Read : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు