BREAKING: హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్! హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు కూల్చివేస్తున్నారు. By V.J Reddy 24 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actor Nagarjuna: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సిద్ధమైంది. కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మూడున్నర ఎకరాల చెరువు స్థలాన్ని N-కన్వెన్షన్ కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమ్మిడి హడ్డి చెరువు ఉంది. ఇటీవలే N-కన్వెన్షన్ సెంటర్ కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే N-కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్నారు. ఇటీవల బాచుపల్లిలో.. ఇటీవల బాచుపల్లి ఎర్రకుంట చెరువు పరిధిలో కట్టిన అపార్ట్‌మెంట్‌లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రగతినగర్ – బాచుపల్లి ఎర్రకుంటలో సర్వే నెంబర్ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. చెరువును ఆక్రమించి మాప్స్ కనస్ట్రక్షన్ నిర్మాణం జరిగింది. 1300 గజాల్లో అపార్ట్‌మెంట్‌ను ఓ సంస్థ నిర్మించింది. ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్.. బిల్డింగ్‌లను కూల్చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆ బిల్డింగ్ ను అధికారులు నేలమట్టం చేశారు. #nagarjuna సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి