Hyderabad Traffic : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో ఈరోజు ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులోనికి తీసుకుని వచ్చారు. By Bhavana 02 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల (Telangana Formation Day) సందర్భంగా నగరంలో ఈరోజు ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని (Traffic Restrictions) సీపీ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరేడ్‌గ్రౌండ్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు , ట్యాంక్‌బండ్‌పై ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10గంటల వరకు, వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని వివరించారు. శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ (Hyderabad) లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులోనికి తీసుకుని వచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయని సీపీ వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళుర్పిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకూ గన్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 📢🚦 #TrafficAdvisory The following traffic restrictions are likely to be imposed on 𝟎𝟏-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒 from 𝟎𝟎𝟎𝟎 hours to 𝟐𝟒𝟎𝟎 hours on 𝟎𝟐-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒, in connection with #TelanganaStateFormationDay celebrations at Upper #Tankbund #Hyderabad.#TrafficAlert pic.twitter.com/85ZhzOmxr8 — Telangana Digital Media Wing (@DigitalMediaTG) June 1, 2024 అలాగే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకూ పరేడ్ గ్రౌండ్ (Parade Ground) ప్రాంతాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని పోలీసులు వివరించారు. అలాగే వివిధ కార్యక్రమాలు ఉన్నందున ట్యాంక్ బండ్ పై రాత్రి పన్నెండు గంటల వరకూ వాహనాల రాకపోకలపై నిషేధాజ్ఞలు ఉంటాయని ఈ విషయాలను గమనించి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు తెలిపారు. Also read: ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్ కానిస్టేబుల్! #telangana-formation-day #hyderabad-traffic-restrictions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి