TS Police : కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

హైదరాబాద్ పాతబస్తీలో 18నెలల చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కు గురైంది. సీసీ ఫుటీ ఆధారంగా 24గంటల్లో ఆ చిన్నారిని పోలీసులు కనుగొన్నారు.

New Update
TS Police : కేవలం ఆరే గంటలు.. కిడ్నాపర్లను వేటాడి పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

హైదరాబాద్ పాతబస్తీలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో సోమవారం ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను అపహరించి తీసుకెళ్తున్న ద్రుశ్యాలు అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా 24గంటల వ్యవధిలోనే ఆ చిన్నారి ఆచూకీని బహుదూర్ పురా పోలీసులు కనుగొన్నారు.

ఫిర్యాదు ఇచ్చిన 4 గంటల్లోనే కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ చేసిన మహిళను అరెస్టు చేసి...ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తన కొడుకుకు 8ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతోనే మహిళ..పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

 తెలంగాణలో ఈ ఏడాది కరోనా తొలి మరణం..

తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైంది. హైదరాబాద్ లోని ఉస్మానియా హస్పిటల్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. చలి జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడని వైద్యులు తెలిపారు. ఇక దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరగగా పలు చోట్ల మరణాల రేటు కూడా నమోదైంది. ఇప్పటి వరకూ దేశంలో 412 యాక్టివ్ కేసులు నమోదు అవగా 4,170 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలో అత్యధికంగా కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కి జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చిన ప్రతి ఒక్కిరికీ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో 455 మందికి కరోనా పాజిటీవ్ సోకిందని, హైదరాబాద్ లోనే అత్యధికంగా 55 కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తీవ్ర జ్వరంతో  ఒక వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రికి రాగా టెస్టులు నిర్వహించి అతనికి కోవిడ్ సోకినట్లు నిర్దారించి చికిత్స అందిస్తుండగానే మంగళవారం ఉదయం చనిపోయాడని తెలిపారు. దీంతో తెలంగాణలో తొలి కరోనా మరణం కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే ఇది కొత్త రకం జేఎన్-1 అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ సదరు వ్యక్తి ఊపిరి తిత్తుల సమస్యతో నిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో కోవిడ్ టెస్టులకు సంబంధించి టెస్ట్ సెంటర్ లను పెంచినట్లు అధికారులు తెలిపారు.  అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని అప్రమత్తంగా ఉండాలని రవీంద్ర నాయక్‌ సూచించారు జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను మన దరి చేరనీయకుండా తరిమి కొట్టవచ్చని అన్నారు.

ఇది కూడా చదవండి: హిందువులపై కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

సంగారెడ్డిలో దారుణం.. రోకలి బండతో భార్యను కొట్టి చంపిన భర్త!

సంగారెడ్డిలో ఓ భర్త భార్యను అతికిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గొడవలతో పుట్టింటిలో ఉన్న భార్యపై కోపంతో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన అత్తను రోకలితో కొట్టి గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
CRIME

CRIME

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

గొడవలు రావడంతో..

కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

హైదరాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా రాఘవాపూర్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

Advertisment
Advertisment
Advertisment