Hyderabad: రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు.. స్థానికుల ఆందోళన! ఈ రోజు రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా 40 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. By Jyoshna Sappogula 26 Aug 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి HYDRA Demolition: హైదరాబాద్‌లో చెరువులు, పార్కులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను (Nagarjuna N Convention) కూడా అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలోనే రాయదుర్గంలో (Rayadurgam) నాన్‌స్టాప్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య రాయదుర్గంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. Also Read: రుణమాఫీలో భారీ కుంభకోణం.. ఆ బ్యాంకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు..! రాయదుర్గం సర్వే నెంబర్ 72లోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకుని సిబ్బందితో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. 40 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని ఉన్నట్టుండి కూల్చివేస్తే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..! అయితే, నగరంలో హైడ్రా కూల్చివేతలపై కొందరు రాజకీయ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేకే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైడ్రాను ముందు పెట్టారని ఆరోపించారు. మరికొందరూ హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సంతోషమే కానీ, సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. ఏది ఏమైన హైడ్రా యాక్షన్ పై తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతోంది. #cm-revanth-reddy #rayadurgam #hydra-demolitions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి