Hyderabad: పోలీసుల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం..! హైదరాబాద్ బోరబండలో పోలీసుల ముందే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న తనను పోలీసులు మామూళ్ల కోసం వేధిస్తున్నారని మహిళ సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ మహిళను బెదిరించడంతో ఆమె ఉరేసుకునేందుకు యత్నించింది. By Jyoshna Sappogula 28 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: పోలీసుల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన హైదరాబాద్ బోరబండలో చోటుచేసుకుంది. బోరబండలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ.. తనను మామూళ్ల కోసం పోలీసులు తరచూ వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. పోలీసులపై మహిళ సీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు పెట్టింది. Also Read: ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు..! అయితే, మాపైనే కేసు పెట్టిస్తావా అంటూ పోలీసులు మహిళ ఇంటికెళ్లి.. అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ మహిళను బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బాధలు భరించడం నా వల్ల కాదు.. నేను ఉరేసుకుంటానని పోలీసుల ముందే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. #hyderabad సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి