Crime News : బాచుపల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. సుత్తి, కత్తి సాయంతో కాలు, చేయిని సగం వరకు నరికి..! హైదరాబాద్ బాచుపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య మధులతను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు భర్త నాగేంద్ర భరద్వాజ యత్నించాడు. ఇంటి నుంచి పారిపోయి ఆస్పత్రిలో చేరి హైడ్రామా చేశాడు. By Jyoshna Sappogula 25 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి Hyderabad Bachupally Murder : హైదరాబాద్ (Hyderabad) బాచుపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (Software Employee) హత్య కేసు (Murder Case) లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యపై, పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య మధులతను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు భర్త నాగేంద్ర భరద్వాజ యత్నించాడు. శరీరాన్ని ముక్కలుగా.. హత్య చేసిన తర్వాత భార్య శరీరాన్ని ముక్కలుగా నరికేందుకు నాగేంద్ర ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సుత్తి, కత్తి సాయంతో మధులత కాలు, చేయిని నాగేంద్ర సగం వరకు నరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఎముకలు బలంగా ఉండటంతో నాగేంద్ర మరో స్కెఛ్ వేశాడు. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి యాక్సిడెంట్ (Accident) గా మలిచేందుకు ప్లాన్ వేశాడు. ఇంటి నుంచి పారిపోయి ఆస్పత్రిలో చేరి హై డ్రామా చేశాడు. Also Read : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ సైకోగా.. నాగేంద్రకు డబ్బు పిచ్చి ఉందని..సైకోగా బిహేవ్ చేసేవాడని మధులత తల్లిదండ్రులు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం మధులతను కొట్టారని.. పంచాయితీ పెట్టి నచ్చజెప్పామన్నారు. నాగేంద్ర పెద్ద ఈగోయిస్ట్, సైకో అని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం.. మధులత హత్య విషయంలో నాగేంద్ర అక్కా, బావ పాత్ర కూడా ఉందంటున్నారు. చంపితే చంపాడు అయితే ఏంటి అన్నట్లు నాగేంద్ర అమ్మ, నాన్న మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్ర, అతని తల్లిదండ్రులు, అక్కా బావపై తీవ్ర చర్యలు తీసుకోవాలంటున్నారు మధులత పేరెంట్స్. పోలీసులు కూడా ఈ కేసుపై నిర్లక్ష్యంగా ఉన్నారనిపేరెంట్స్ ఆరోపిస్తున్నారు. #hyderabad #bachupally-murder #software-employee #psycho మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి