Wife Torture : నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..! నా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ RTVని ఆశ్రయించారు. ఇంటికెళ్తే తన భార్య చంపేస్తుందని అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత భర్త వాపోతున్నాడు. By Jyoshna Sappogula 19 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Hyderabad : నా భార్య (Wife) నుంచి నన్ను కాపాడండి.. అంటూ పోలీసులకు ఓ బాధిత భర్త (Husband) ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ (AP) లోని రాజోలుకు చెందిన టెమూజియన్ అనే వ్యక్తికి అమలాపురంకు చెందిన లక్ష్మీగౌతమికి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ తన భార్య తనను హింసిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి తనను అకారణంగా వేదిస్తుందని వాపోతున్నాడు. Also Read: పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని..బెంగళూరుకు మకాం..! ఇంటికెళ్తే నా భార్య చంపేస్తుంది అంటూ అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు బాధిత భర్త. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీంతో RTV ని ఆశ్రయించిన అతను తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు. #hyderabad #husband #wife-torture మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి