Unemployment: అయ్యో.. ఉన్నవి పది ఉద్యోగాలు.. వందలాది మంది పోటీ.. తొక్కిసలాట!

గుజరాత్‌లోని భరూచ్‌లో కేవలం 10 ఖాళీల కోసం కెమికల్‌ సంస్థ థర్మాక్స్‌ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీనికి వందలాది మంది యువకులు హాజరుకావడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
Unemployment: అయ్యో.. ఉన్నవి పది ఉద్యోగాలు.. వందలాది మంది పోటీ.. తొక్కిసలాట!

Unemployment: మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్ లో కనిపించింది. చిన్న ఉద్యోగం అయినా సరే దొరికితే చాలు అనే పరిస్థితిలో యువత ఉన్నారు. గుజరాత్ లో పది ఉద్యోగాల కోసం వందలాది మంది ఇంటర్వ్యూకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఇంటర్వ్యూకు వచ్చిన నిరుద్యోగులను తోసివేయడంతో తొక్కిసలాట జరిగిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో, పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హోటల్‌లోకి ప్రవేశించడానికి కష్టపడుతున్నారు. అక్కడ గుజరాత్‌లోని భరూచ్‌లో కేవలం 10 ఖాళీల కోసం కెమికల్‌ సంస్థ థర్మాక్స్‌ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ సమయంలో కొందరు యువకులు రెయిలింగ్‌పై నిలబడి ఉండడంతో అది విరిగిపోయింది.

Unemployment: థర్మాక్స్ షిఫ్ట్-ఇన్-ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్, ఫిట్టర్-మెకానికల్ మరియు ఎగ్జిక్యూటివ్ (ETP) పోస్టుల కోసం లార్డ్స్ ప్లాజా హోటల్, అంకలేశ్వర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నిరుద్యోగ సమస్యను హైలైట్ చేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇక్కడ మీరు చూడొచ్చు.. 

భరూచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయూర్ చావ్డా మాట్లాడుతూ, "మా సమాచారం ప్రకారం, ఒక కంపెనీ ఐదు వేర్వేరు పాత్రలలో దాదాపు 40 ఖాళీల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసింది." చెప్పారు. అంతేకాకుండా "కంపెనీ అంక్లేశ్వర్‌లోని ఒక హోటల్‌లో ఒక హాల్‌ను బుక్ చేసింది.  దాదాపు 150 మంది అభ్యర్థులు వస్తారని ఆశించారు. అయితే, 800కు పైగా హాజారయ్యారు. వారిని  నియంత్రించడానికి కంపెనీ అధికారులు ఇంటర్వ్యూ హాల్  తలుపును మూసివేయవలసి వచ్చింది, ఇది వీడియోలో చూపిన పరిస్థితికి దారితీసింది, "అని ఆ అధికారి వివరించారు.

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఈ ఘటనతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, అధికార బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ సంఘటన "గుజరాత్ మోడల్" ని బహిర్గతం చేసిందని కాంగ్రెస్ చెబుతుండగా, భారతీయ జనతా పార్టీ ఈ వీడియో ద్వారా రాష్ట్ర పరువు తీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు