లైంగిక ఉద్దేశం లేకుండా మహిళను కౌగిలించుకోవడం... బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు...!

ఎలాంటి లైంగిక ఉద్దేశం లేదా నేరానికి పాల్పడాలన్న ఆలోచన లేకుండా ఓ స్త్రీని కౌగిలించుకోవడం, ఆమెను తాకటం నేరం కాదని రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తరఫు న్యాయవాది అన్నారు. ఘటన గతంలో జరిగిందని, ఇన్నేండ్లు స్వేచ్చగా తిరిగిన రెజర్లు ఐదేండ్ల తర్వాత ఆరోపణలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

author-image
By G Ramu
New Update

రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌ భూషణ్‌ తో పాటు సస్పెన్షన్ కు గురైన డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌పై లైంగిక వేధింపుల కేసులో అభియోగాలు నమోదు చేయాలా లేదా అనే విషయంపై ఈ రోజు ఢిల్లీ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ తరఫున న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ వాదనలు వినిపించారు.

ఢిల్లీలోని అశోక రోడ్డులోని హోటల్, సిరి కోటలోని ఆడిటోరియంలో తమను బ్రిజ్ భూషణ్ తమను 20 నుంచి 25 సెకన్లు కౌగిలించుకున్నారన్న పిటిషనర్ల ఆరోపణలను ఆయన ఖండించారు. ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా ఓ మహిళను తాకడం, కౌగిలించుకోవడం నేరం కాదని ఆయన వాదించారు. క్రీడల్లో చాలా వరకు పురుష కోచ్ లే ఎక్కువగా వుంటారని చెప్పారు.

చాలా సందర్బాల్లో మహిళా క్రీడాకారులు గొప్ప విజయం సాధించిన సందర్బాల్లో వాళ్లను కోచ్ లు కౌగిలించుకుంటారన్నారు. కేవలం ఉత్సాహంతో మాత్రమే వాళ్లను అలా కౌగిలించుకుంటారని అన్నారు. దాని వెనుక ఎలాంటి లైంగిక ఉద్దేశం లేదు కాబట్టి దాన్ని నేరంగా పరిగణించకూడదన్నారు. ఇక ఈ కేసులో రెజ్లర్లు చెబుతున్న ఘటనల్లో కొన్ని భారత్ వెలుపల జరిగాయన్నారు. వాటిలో కేవలం మూడు మాత్రమే భారత్ పరిధిలోకి వస్తాయన్నారు.

ఈ కేసులో సుదీర్ఘ కాలం తర్వాత ఫిర్యాదు దారులు ఆరోపణలు చేశారని అన్నారు. ఇన్నాళ్ల పాటు వాళ్లంతా స్వేచ్చగా తిరిగారని, ఇప్పుడు వచ్చి తమకు ముప్పు వుందంటూ చెప్పడం సరికాదని ఆయన వాదించారు. వాదనల అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ద్వి సభ్య ధర్మాసనం వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు