Jobs : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి!

సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.

New Update
Jobs : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి!

Singareni : తెలంగాణలో(Telangana)  ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీల(Job Vacancies) ను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్లను విడుదల(Notification Released) చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సింగరేణి(Singareni) లో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.

మొత్తం ఖాళీ పోస్టులు.. 327

ఇందులో ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌... మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఈఎం) , ఈ2 గ్రేడ్‌ -42 పోస్టులు, మేనేజ్‌ ట్రైనీ (సిస్టమ్స్‌) ఈ 2 గ్రేడ్‌ -7. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ ...జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రైనీ (జేఎంఈటీ), టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ - 100, అసిస్టెంట్‌ ఫోర్‌ మ్యాన్‌ ట్రైనీ (మెకానికల్‌) టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ -9, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌)టీ-ఎస్‌ గ్రేడ్‌ సీ-24, ఫిట్టర్‌ ట్రైనీ క్యాట్‌ 1-47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ, క్యాట్‌ 1-98 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.

ఈ పోస్టులకు అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారు డిగ్రీ పీజీ, ఐఐటీ, డిప్లొమా లో ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్‌ను బట్టి జూన్‌ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారంటే... రాత పరీక్ష(Written Test).. మెరిట్‌ ఆధారంగా, టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్‌ టెస్ట్‌ పెడతారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీలు : ఏప్రిల్‌ 15.2024 నుంచి మే 04..2024 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు..
వెబ్‌సైట్‌: https://scclmines.com/.. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి.

Also Read : నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9,970 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా మే 11 వరకు అప్లై చేసుకోవచ్చు.

New Update
RRB ALP Jobs 2025

RRB ALP Jobs 2025

రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం అయింది. మే 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకున్న అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌,  ఎలక్ట్రికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా అర్హులు. రెండు స్టేజ్‌ల కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

RRB రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బెంగళూరు, బిలాస్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, చండీఘడ్‌, పట్నా, జమ్ము అండ్‌ శ్రీనగర్, గువాహటి, మాల్దా, కోల్‌కతా, ముజఫర్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ముంబయి, సికింద్రాబాద్, రాంచీ, తిరువనంతపురం, సిలిగురి, గోరఖ్‌పూర్. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య- 9,970.

రీజియన్ల వారీగా ఖాళీలు

అహ్మదాబాద్ - 497 పోస్టులు

అజ్మీర్ - 820 పోస్టులు

ప్రయాగ్‌రాజ్‌ -588 పోస్టులు

భోపాల్‌ - 664 పోస్టులు

భువనేశ్వర్ -928 పోస్టులు

 బిలాస్‌పూర్ - 568 పోస్టులు

 చండీఘడ్‌ - 433 పోస్టులు

చెన్నై - 362 పోస్టులు

ముజఫర్‌పూర్ - 89 పోస్టులు

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

పట్నా - 33 పోస్టులు

ప్రయాగ్‌రాజ్ - 286 పోస్టులు

రాంచీ - 1,213 పోస్టులు

సికింద్రాబాద్ - 1,500 పోస్టులు

సిలిగురి - 95 పోస్టులు
గువాహటి - 30 పోస్టులు

జమ్ము అండ్‌ శ్రీనగర్ - 08 పోస్టులు

కోల్‌కతా - 720 పోస్టులు

మాల్దా - 432 పోస్టులు

ముంబయి - 740 పోస్టులు

తిరువనంతపురం - 148 పోస్టులు

గోరఖ్‌పూర్ - 100 పోస్టులు

అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025.

jobs | rrb recruitment 2025 | rrb updates | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment