Badrinath: బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు..భయంతో పరుగులు పెట్టిన జనం

ఉత్తరాఖండ్‌లోని చమోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై ఈరోజు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. జోషిమత్‌లోని చుంగి ధార్ వద్ద కొండ లోని పెద్ద భాగం ముక్కలు ముక్కలు అయింది. దీంతో ఆ రోడ్డు మీద వెళుతున్న తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

New Update
Badrinath: బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు..భయంతో పరుగులు పెట్టిన జనం

Land Slides: బద్రీనాథ్‌లో ఉన్నట్టుండి కొండ ఒక్కసారిగా విరిగిపడింది. అక్కడి జాతీయ రహదారి మీద నుంచి లోయలోకి రాళ్ళు గుట్టలుగా జారాయి. జోషిమత్‌లోని చుంగిధార్ దగ్గర కొండ విరిగింది. దాని పక్కగానే జాతీయ రహదారి ఉంది. కొండ చరియలు పడిన సమయంలో చాలా వాహనాలు ఆ దారి గుండా వెుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా వందల కొద్దీ వాహనాలు నిలిచపయాయి. అదృష్టవశాత్తు ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం కలుగులేదు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు బద్రీనాథ్ హైవేని బ్లాక్ చేసి శిథిలాలను తొలగిస్తున్నారు.

గతకొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, శిథిలాల కారణంగా ..బద్రీనాథ్‌కు వెళ్లే హైవే అనేక ప్రదేశాల్లో మూసుకుపోయింది. మరోవైపు చంపావత్ , ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు భారీగా జలమయమయ్యాయి. ఇక చమోలిలో రెండు చోట్ల శిథిలాలు పడిపోవడం, పేరుకుపోవడంతో శుక్రవారం కూడా బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది . రద్దీగా ఉండే భానర్‌పాని-పిపల్‌కోటి నాగ పంచాయతీ రహదారి,అంగ్థాలా రహదారిపై కూడా రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతాల్లో చాలామంది స్థానికులు, ప్రయాణికులు చిక్కుకుపోయారు.

మరోవైపు శనివారం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీశారు. కొండచరియలు విరిగిపడటంతో రుద్రప్రయాగ్-కేదార్‌నాథ్ జాతీయ రహదారి కూడా మూసుకుపోయింది.

Also Read:Telangana: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి

Advertisment
Advertisment
తాజా కథనాలు