Fire Accident : విశాఖ రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం

AP: విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో బోగీలు తగలబడ్డాయి. రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

New Update
Fire Accident : విశాఖ రైల్వే స్టేషన్‌లో ఘోర అగ్నిప్రమాదం

Tirumala Express : విశాఖ రైల్వే స్టేషన్ (Visakhapatnam Railway Station) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. కోర్బా- విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Korba - Visakha Express)18517) రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. స్టేషన్‌లోని 4వ నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులను బయటకు పంపారు అధికారులు. మంటల్లో బోగీలు తగలబడ్డాయి. రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. బీ6, బీ7, ఎం1 బోగీలు మంటలకు పూర్తిగా దగ్దమయ్యాయి. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో..

ఈ ప్రమాదంలో  మూడు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. బీ7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో బీ7 బోగీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. బీ6, ఎం1 బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

రైలులో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప చెప్పారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, పోలీసులు.. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read : మధురమైన స్నేహబంధం.. దాన్ని అలా చూడకండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు