Karimnagar: కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 5గ్యాస్ సిలిండర్లు పేలి! మంగళవారం తెల్లవారుజామున కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్‌నగర్‌లో కార్మికుల పూరిళ్లు కాలి బూడిదైపోయాయి. 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారంతా మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. By srinivas 20 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Fire Accident in Karimnagar: కరీంనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కార్మికుల గుడిసెలు కాలి బూడిదైపోయాయి. అంతేకాదు మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) పేలాయి. దీంతో ఆ మంటలు కాస్త చుట్టుపక్కలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 5 గ్యాస్ సిలిండర్లు పేలి.. ఈ మేరకు కరీంనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో (Subhashnagar) వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు పూరిళ్లు వేసుకుని నివాసముంటున్నారు. అయితే ఇదే ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అదించగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: MLA RK: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు! ప్రాణనష్టం తప్పింది.. అయితే ఈ పూరిళ్లలో నివాసం ఉంటున్న కార్మిక కుటుంబాలన్నీ మేడారం జాతరకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. #karimnagar #huge-fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి