డ్యూటీ అయిపోయిందని ప్యాసింజర్లను గాలికొదిలేసిన పైలెట్లు..!

గతంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఎయిర్‌ ఇండియా తాజాగా.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి పైలెట్ ప్రవర్తన ప్యాసింజర్లను చిక్కుల్లో పడేసింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అత్యవసర లాండింగ్ చేయాల్సి వచ్చి జైపూర్ లో దిగింది. ఆ తర్వాత మళ్లీ టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఉన్న పైలెట్లు తాము టేక్ ఆఫ్ చేయమని చెప్పడం వివాదంగా మారడంతో ప్యాసింజర్లు అయోమయంలో పడ్డారు.

New Update
డ్యూటీ అయిపోయిందని ప్యాసింజర్లను గాలికొదిలేసిన పైలెట్లు..!

air-india-pilots-refuses-to-fly-till-destination-as-their-duty-hours-are-over

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-112 విమానం లండన్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్‌ అయ్యింది. లాండింగ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. విమానం తిరిగి ఢిల్లీ వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఇక్కడే ఆ విమానంలో ఉన్న పైలెట్లు ట్విస్ట్ ఇచ్చారు. తన డ్యూటీ టైం అయిపోయిందని ఒకరు, తనకు సంబంధం లేదని మరొకరు.. విమానాన్ని నడపబోనని పట్టుబట్టారు.

దీంతో విమానంలోని 350 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు విమానంలో ఉండిపోయారు. వాస్తవానికి విమానం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. జైపూర్ లో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక చేసేది లేక ప్రయాణికుల్లో కొందరిని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించగా, విమాన సిబ్బందిని మార్చిన తర్వాత అదే విమానంలో మిగతా వారిని పంపించారు. ఆ విమానం కొన్ని గంటల తర్వాత తిరిగి ఢిల్లీ చేరుకుంది. జైపూర్‌లో తాము ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి నెట్టింట షేర్‌ చేశారు. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటివరకూ ఏ విధంగానూ స్పందించలేదు.

https://twitter.com/ABritishIndian/status/1672793383918780418?s=20

Advertisment
Advertisment
తాజా కథనాలు