వాకింగ్ ఏ సమయంలో చేస్తే బరువు తగ్గుతారు..? ఉదయాన్నే నడవడం వల్ల చాలా లాభాలున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 30 నిమిషాలు నడిస్తే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడంతో చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి. By Durga Rao 30 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవటం ఎంతముఖ్యమో వ్యాయామం చేయటం కూడా అంతే ముఖ్యం. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. వ్యాయామాల విషయానికి వస్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖర్చు అవసరం లేనిది.. వాకింగ్. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వాకింగ్ చేసే వారు రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయలేకపోతే ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున చేయవచ్చు. ఇలా వాకింగ్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. వాకింగ్‌ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. క్రమంగా వేగం పెంచాలి. షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకే వాకింగ్ చేయడం మంచిది. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయనే ఆందోళన ఉండదు. మిగిలిన వారు మామూలుగా పరగడుపున కూడా నడవచ్చు. కడుపు నిండా తిని స్పీడుగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు. వేడి వాతావరణంలో కాటన్ దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి. అదే చలి వాతావరణంలో అయితే ఉన్ని దుస్తులను ధరించి వాకింగ్ చేయాలి. ఇలా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వస్త్రాలను ధరించి వాకింగ్ చేస్తే మంచిది. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయాసం వస్తే కొంత సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ వాకింగ్‌ను ప్రారంభించవచ్చు. అయితే గుండె జబ్బులు ఉన్నవారు వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. ప్రతిరోజు 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడుస్తూ.. రోజుకు రెండు నుంచి నాలుగు మైళ్ల దూరం నడవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి