Bed Sheet: బెడ్‌ షీట్‌ వేయడానికి ఇబ్బంది పడుతున్నారా..ఇలా ట్రై చేయండి!

ఉదయం నిద్రలేచిన తర్వాత బెడ్‌షీట్‌ను తీసి మళ్లీ వేయాలి. ఇలా చేయడం వల్ల బెడ్ షీట్లు ముడతలు పడకుండా ఉంటాయి. సాగే బెడ్‌షీట్లు మంచం మూలల్లో సాగడం వల్ల బెడ్‌కి బాగా సరిపోతాయి. బెడ్‌ షీట్‌ను సింపుల్‌గా ఎలా వెయ్యాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Bed Sheet: బెడ్‌ షీట్‌ వేయడానికి ఇబ్బంది పడుతున్నారా..ఇలా ట్రై చేయండి!

బెడ్‌షీట్ వేసేటప్పుడు అది పదేపదే జారిపోతూ ఉంటుంది. లేదా ముడతలు పడుతూ ఉంటుంది. కొన్ని ట్రిక్స్‌ ఫాలో అవడం వల్ల బెట్‌షీట్‌ను చక్కగా వేసుకోవచ్చు. అలాగే రోజుల తరబడి ముడతలు కూడా పడకుండా ఉంటుంది. అంతేకాకుండా గది కూడా అందంగా కనిపిస్తుంది.
సాగే బెడ్‌షీట్‌లను ఉపయోగించండి

సాగే బెడ్‌షీట్లు మంచం మూలల్లో సాగడం వల్ల బెడ్‌కి బాగా సరిపోతాయి. అంతేకాకుండా జారకుండా ఉంటాయి. అంతేకాకుండా బెడ్‌ మీద వేయడం కూడా సులభంగా ఉంటుంది. ఫిట్‌గా ఉండటం వల్ల బెడ్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాగే బెడ్‌షీట్‌లను ఉపయోగించడం వల్ల బెడ్‌కు కూడా ఎలాంటి నష్టం ఉండదు.

బెడ్‌షీట్ గార్టర్‌
మార్కెట్‌లో లభించే బెడ్‌షీట్ గార్టర్‌లు లేదా క్లిప్‌ల సహాయంతో బెడ్‌షీట్‌ను నాలుగు మూలలా సమానంగా పరుచుకోవచ్చు. అంతేకాకుండా బెడ్‌షీట్‌ కూడా జారిపోకుండా స్థిరంగా ఉంటుంది.

సరైన సైజు బెడ్‌షీట్‌
బెడ్‌షీట్‌ను కొనుగోలు చేసినప్పుడు బెడ్ పరిమాణాన్ని గుర్తుంచుకోండి. బెడ్‌ షీట్ పెద్దది లేదా చిన్నది అయితే దానిని వేయడం కష్టంగా ఉంటుంది. బెడ్‌కు సరిపోయే బెడ్‌షీట్‌ను కొనుగోలు చేస్తే సులభంగా వేయడమే కాకుండా అందంగా కనిపిస్తుంది. అలాగే ప్రతిరోజూ బెడ్‌షీట్‌ను కొద్దిగా స్ట్రెచ్ చేయాలి.

ఇలా చేయండి
ఉదయం నిద్రలేచిన తర్వాత బెడ్‌షీట్‌ను తీసి మళ్లీ వేయాలి. ఇలా చేయడం వల్ల బెడ్ షీట్లు ముడతలు పడకుండా ఉంటాయి. అంతేకాకుండా బెడ్‌ రూమ్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.

Also Read: ఇలా చేస్తే వయసుతో పాటు ప్రేమ కూడా పెరుగుతుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు