రోజుకు ఎంత మోతాదులో షుగర్ తీసుకోవచ్చు..!

రోజుకి ఎన్ని గ్రాముల షుగర్ తీసుకోవచ్చు అనే టాపిక్‌పై ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. అందులో తెలిసిన విషయాలను బట్టి కొన్ని సూచనలు కూడా చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
రోజుకు ఎంత మోతాదులో షుగర్ తీసుకోవచ్చు..!

ICMR చేసిన రీసెర్చ్‌లో ఒక వ్యక్తి రోజుకి ఎంత షుగర్ తీసుకోవాలి అన్నది ఆ వ్యక్తి తీసుకునే క్యాలరీలపై ఆధారపడి ఉంటుందని తేలింది. రోజువారీ తీసుకునే క్యాలరీల్లో షుగర్ శాతం ఐదు కంటే ఎక్కువ ఉండకూడదట. అంటే తీసుకునే ఆహారంలో తీపి పదార్థాలు ఐదు శాతం కంటే మించకుండా చూసుకోవాలి.అయితే ఈ లెక్కలన్నీ టీ, కాఫీలు, స్వీట్లలో వాడే ఆర్టిఫీషియల్ చక్కెర గురించే. సహజంగా లభించే షుగర్స్‌పై ఇలాంటి పరిమితులు లేవు.

పండ్లు, కూరగాయాల్లో ఉండే నేచురల్‌ షుగర్స్‌ వల్ల పెద్దగా నష్టం ఉండదని, యాడెడ్ షుగర్స్ వల్లనే రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ అంటోంది. ఇలా అదనంగా చక్కెర తీసుకోవాల్సి వచ్చినప్పుడు మితంగా చూసి తీసుకోవాలని సూచిస్తోంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీ, కాఫీలు మొదలు మిల్క్‌షేక్స్, స్వీట్స్, కేక్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్‌.. ఇలా చాలా పదార్ధాల్లో షుగర్ ఉంటుంది. వీటిపై కొంత కంట్రోల్ ఉండడం అవసరం. యాడెడ్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ 6 -ఫాస్ఫేట్ పెరుగుతుంది. ఇది ఇది గుండె కండరాలను బలహీనపరుస్తుంది. తద్వారా పలురకాల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైట్ షుగర్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు పెరుగుతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి పంచదార వాడకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది.

షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ కలుగుతుంది. దీనివల్ల నెలసరి సమస్యలు, ప్రెగ్నెన్సీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. సూక్ష్మపోషకాలు లోపిస్తాయి. మనదేశంలో పెరుగుతున్న ఒబెసిటీ సమస్యకు షుగర్ ఎక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణంగా ఉంటోంది. ఇకపోతే షుగర్‌‌కు బదులు ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ తీసుకుంటే మంచిదనుకుంటారు చాలామంది. కానీ, షుగర్ కంటే అవే ఎక్కువ హానికరం అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తోంది. కాబట్టి కృత్రిమంగా తయారైన ఎటువంటి షుగర్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు