Elephant: మన్యంలోటెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు! పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. By Bhavana 06 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Elephant Missing in Manyam District: పార్వతీపురం జిల్లాలో ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఏనుగుల మంద నుంచి వేరు పడిన హరి అనే ఏనుగు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో అర్తాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.ఏ నిమిషంలో ఏ పక్క నుంచి ఏనుగు వచ్చి దాడి చేస్తుందో అని నిత్యం వణికిపోతున్నారు. హరి అనే ఏనుగు నిన్నటి నుంచి కనిపించకపోవడంతో అటు గ్రామస్థులతో పాటు అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. గత కొంత కాలంగా మన్యం ప్రజలను ఏనుగులు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏనుగులు దాడి చేయడంతో సుమారు 11 మంది వరకు మరణించారు. అవి దాడి చేసే చంపేయడంతో పాటు..కొన్ని సందర్భాల్లో అవి కూడా చనిపోతున్నాయి. సుమారు నాలుగైదు సంవత్సరాల నుంచి ఏనుగుల దాడిలో కొన్ని కోట్ల విలువైన ఆస్తులు నాశనం అయ్యాయని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. Also Read: బాబోయ్ ఇంట్లోకి కింగ్ కోబ్రా.. తర్వాత ఏం జరిగిందంటే? కొన్ని నియోజక వర్గాల్లో అయితే ఏనుగులు ఎప్పుడూ దాడి చేస్తాయో అనే భయంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గుడుపుతున్నారని వాపోతున్నారు. ఏనుగులు గ్రామాల మీద, పొలాల మీద ఆస్తుల మీద ఇలా దాడులు చేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల మీదకు రాకుండా చర్యలు చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు. లేని పక్షంలో అన్ని గ్రామాల వారు ఏకమై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఏనుగు దంపతులను చంపేసిందని వారు తెలిపారు. అయినప్పటికీ ఒక్క ప్రభుత్వాధికారి కానీ, అటవీశాఖ అధికారులు కానీ ఎవరూ కూడా స్పందించలేదని వారు వాపోతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఎంత మందిని చంపే వరకు చూస్తారన్నారు. తక్షణమే ఏనుగుల తరలింపుకు తదితరులు చేపట్టాలన్నారు. Also Read: వామ్మో..ఒక్క బిస్కెట్ రూ.లక్ష..! #elephant #manyam #elephant-missing-in-manyam-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి