ఆగష్టు నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు ఓపెన్ ఉంటాయంటే! ఆగష్టు నెలలో బ్యాంకులు ఓపెన్ ఉండేది కేవలం 18 రోజులు మాత్రమే. మిగతా 13 రోజులు బ్యాంకులకు సెలవులున్నా ఖాతాదారులకు ఇబ్బందులు కాకుండా ఉండడానికి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ నెల అన్ని రాష్ట్రాల బ్యాంకు సెలవు దినాలను విడుదల చేస్తుంటుంది. By P. Sonika Chandra 25 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి ఆగష్టు నెలలో బ్యాంకులు ఓపెన్ ఉండేది కేవలం 18 రోజులు మాత్రమే. మిగతా 13 రోజులు బ్యాంకులకు సెలవులున్నా ఖాతాదారులకు ఇబ్బందులు కాకుండా ఉండడానికి..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతీ నెల అన్ని రాష్ట్రాల బ్యాంకు సెలవు దినాలను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆగష్టు నెలలో బ్యాంకు సెలవు దినాలను ప్రకటించగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు పండుగలన్నీ కలుపుకొని 13 రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్ ఉన్నాయి. ఆగష్టు 6 ఆదివారం, 8న రమ్ ఫాట్ కారణంగా గ్యాంగ్టక్ లోని టెండాంగ్ లో సెలవు దినం. 12 న రెండో శనివారం కాగా, 13న ఆదివారం కావడంతో సెలవు ఉంది. ఇక ఆగష్టు 15స్వాతంత్ర దినోత్సవం, 16న పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగూర్, బేలాపూర్ లో బ్యాంకులకు సెలవులు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆగష్టు 18న శ్రీమంత శకర్డేవ్ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. 20 న ఆదివారం ఉంది. 26న నాల్గో శనివారం 27న ఆదివారం కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక ఆగష్టు 28న మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఆగష్టు 30న రక్షా బంధన్ పండుగ ఉండడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించడం జరిగింది. అదే విధంగా తరువాతి రోజున శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్ అబ్బోల్ కారణంగా డెహ్రాడూన్, గాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవులను ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సెలవు దినాలను దృష్టిలో పెట్టుకోవాలని ఖాతాదారులను సూచించింది. అయితే కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రకటించిన ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి