Video: ప్రైవేట్ పార్ట్‌పై పేలిన టపాసులు.. కావాలనే విసిరారా? ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో! By Trinath 13 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. ఆకతాయి తనంగా చేసే పనులతో చాలా మంది జీవితాలే నాశనం అవుతున్నాయి. మరికొంతమంది మతం, కులం పేరిట దాడులు, హత్యలు చేస్తున్నారు. సాటి మనిషిని చంపుతున్నామన్న విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. కొన్ని సంఘటనల గురించి వింటుంటే ఈ సమాజంపై విరక్తి కలుగుతోంది. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగింది. ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్ టార్గెట్‌గా కొందరు టపాసులు పేల్చారు. ఈ ఘటనలో బాధితుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చనిపోయాడు ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఘజియాబాద్(Ghaziabad)లో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఇనుప పైపులో సల్ఫర్, పొటాష్‌ని నింపారు. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతని వెనుకకు వచ్చారు. అతని బ్యాక్ సైడ్‌లో ప్రైవేట్ పార్ట్‌పై ఆ బాంబును విసిరినట్లు వీడియోలో కనిపిస్తోంది. తన వెనుక బాంబు పేలడంతో ఆ వ్యక్తి నొప్పితో విలవిలలాడాడు. అతడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన వ్యక్తి పేరు అఫ్జల్‌గా పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని ప్రదీప్‌గా గుర్తించారు. Tragedy strikes this Diwali in Ghaziabad! 😢 A man lost his life as friends misused firecrackers. Let's spread awareness about celebrating responsibly. #TheBuzzNews #DiwaliTragedy #FirecrackerSafety #GhaziabadIncident pic.twitter.com/fLSSbSPnXU — The Buzz News (@TheBuzzDotNews) November 13, 2023 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్ స్నేహితులు వెనుక నుంచి పైప్ క్రాకర్‌ను పేల్చడం, ఆ తర్వాత అఫ్జల్ నేలపై పడి చనిపోవడం వీడియోలో చూడవచ్చు. దీపావళి రోజు రాత్రి లింక్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాందాపూర్‌లో ఈ ఘటన జరిగింది. అఫ్జల్ జార్ఖండ్ నివాసి. 25ఏళ్లుగా ఘజియాబాద్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జార్ఖండ్‌లోని అతని బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసును హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు చనిపోయింది ముస్లిం వ్యక్తి కావడంతో సంబంధిత ఏరియాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Also Read: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా? WATCH: #viral-video #diwali-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి