Tamil Nadu: తమిళనాడులో పరువు హత్య.. కన్న కూతురిని దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు.. తమిళనాడు-తిరుపూర్‌లో జరిగిన పరువు హత్య సంచలనం రేపుతోంది. ఎస్సీ కులానికి చెందిన నవీన్, బీసీ కులానికి చెందిన ఐశ్వర్య ప్రేమించి.. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తక్కువ కులం యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్న కూతురిని హత్య చేశారు ఐశ్వర్య తల్లిదండ్రులు. By Jyoshna Sappogula 11 Jan 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Tamil Nadu: తమిళనాడులో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి అతి దారుణంగా హత్య చేశారు తల్లిదండ్రులు. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మరి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్(19) ఐశ్వర్య(19)లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. తర్వాత ఇద్దరూ సొంత ఊరు నుంచి తిరుపూర్ కు వెళ్లి ఉద్యోగం చేస్తుండేవారు. Also Read: ‘ షర్మిలకు పగ్గాలు ఇవ్వొద్దు.. జగన్ షర్మిల ఒక్కటే’.. మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ తొలుత నవీన్ తిరూర్ కు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.. తర్వాత ఐశ్వర్యను కూడా మరో ప్రైవేటు కంపెనీలో చేర్పించాడు. ఇలా వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తూ దాదాపు 20 నెలలు ఒకే రూమ్ లో ఉంటూ సహజీవనం చేసేవారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరిద్దరూ వేరు వేరు కులాలకు చెందినవారు కావడంతో తమ పెళ్లికి పెద్దలు ఆంగీకరించరని ఎవరికీ తెలియకుండా గతేడాది డిసెంబర్ 31వ తేదీన పెళ్లి చేసుకున్నారు. మరోవైపు ఐశ్వర్య తల్లిదండ్రులు.. తమ కూతురు ఐశ్వర్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ ఐశ్వర్యలను గుర్తించిన పోలీసులు.. ఐశ్వర్యను తన తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వారు… వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పరువుతీస్తావా అంటూ పెట్రోల్ పోసి నిప్పటించి అతి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. కానీ ఐశ్వర్యను హత్య చేసి చంపారంటూ ప్రియుడు నవీన్ పోలీసలుకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ఐశ్వర్య తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం నిందితులను 15 రోజల కస్టడికి అనుమతించింది. #tamil-nadu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి