Cleaning tips: క్లీనింగ్‌కు రసాయనాలు వాడుతున్నారా..జాగ్రత్త

ఆరోగ్యంగా జీవించాలంటే శరీర శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఇంటి కోసం కెమికల్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. హడావుడిలో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ప్రకటనలు చూసి మార్కెట్ నుంచి తెచ్చిన రసాయనాలతో క్లీనింగ్‌ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

New Update
Cleaning tips: క్లీనింగ్‌కు రసాయనాలు వాడుతున్నారా..జాగ్రత్త

ఆరోగ్యవంతమైన జీవితానికి మంచి ఆహారంతో పాటు ఇంటి శుభ్రత కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చాలా రసాయనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఫ్లోర్ క్లీనింగ్‌కి ఒకటి, టాయిలెట్‌ కోసం మరొకటి, బాత్రూమ్‌కి అయితే ఇంకోటి. ఇలా రకరకాల పేర్లతో మార్కెట్‌లో కెమికల్ ప్రొడక్ట్స్ చాలానే దొరుకుతున్నాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే హడావుడిలో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ప్రకటనలు చూసి మార్కెట్ నుంచి తెచ్చిన రసాయనాలతో క్లీనింగ్‌ చేసుకోవడం వల్ల అవి ఆరోగ్యాన్ని మరింత నాశనం చేస్తు్న్నాయి.

డిటర్జెంట్:

మనం బట్టలు ఉతకడానికి సబ్బు ఉపయోగిస్తాం. కానీ దీనికి సోడియం లారిల్ సల్ఫేట్, ఎన్‌పీఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు క్యాన్సర్‌కు కారణమవుతాయి.

నాన్-స్టిక్ పాత్రలు:

ఈ రోజుల్లో నాన్-స్టిక్ పాత్రలు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తాయి. వీటిలో వండటంతో పాటు శుభ్రం చేయడం కూడా సులభం. ఈ నాన్-స్టిక్ పాత్రను తయారు చేయడానికి పాలి టెట్రాఫ్లోరోఎథిలిన్ ఉపయోగిస్తారు. వీటిలో వండిన ఆహారం తింటే సరిగా జీర్ణం కాదు, అంతేకాకుండా శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

సువాసన:

చెమట వాసన పోగొట్టుకోవడానికి రకరకాల సువాసన వచ్చే పెర్ఫ్యూమ్స్‌ వాడుతుంటాం. ఇందులో వాడే యాంటీ పెర్స్పిరెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎయిర్ ఫ్రెషనర్:

ఇంటిని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి ఎయిర్ ఫ్రెషనర్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వీటిని కొనే ముందు ఓ సారి చెక్‌చేయాలని నిపుణులు అంటున్నారు. దానిపై phthalates అని ఉంటే దాన్ని వాడొద్దంటున్నారు. ఎందుకంటే అది శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని చెబుతున్నారు.

క్లీనర్:

ఇల్లు, టాయిలెట్ శుభ్రం చేయడానికి క్లీనర్‌ని ఉపయోగిస్తాం. ఇందులో ఉండే ట్రైక్లోసన్, క్వాటర్నరీ రసాయనాలు అనేక వ్యాధులకు కారణమవుతాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: గర్భాశయంలో సమస్యలు ఉంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు