Hindustan Zinc: వారేవా! గంటకు కోటిన్నర.. ప్రభుత్వానికి ఆ కంపెనీ నుంచి డబ్బే డబ్బు!

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రతి గంటకు రూ. 1.50 కోట్లు ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.13,195 కోట్లు అందించినట్లు హిందుస్థాన్ జింక్ సోమవారం స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. గత ఐదేళ్లలో ప్రభుత్వానికి రూ.77,803 కోట్లను సమకూర్చింది

New Update
Hindustan Zinc: వారేవా! గంటకు కోటిన్నర.. ప్రభుత్వానికి ఆ కంపెనీ నుంచి డబ్బే డబ్బు!

Hindustan Zinc: హిందుస్థాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించడంలో తిరుగులేని విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే,  ప్రతి గంటకు కంపెనీ ప్రభుత్వ ఖజానాకు రూ.1.50 కోట్లకు పైగా అందించింది. విశేషమేమిటంటే ఈ కంపెనీలో వేదాంత గ్రూప్‌కు దాదాపు 65 శాతం వాటా ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వాటా దాదాపు 30 శాతం. ఈ కంపెనీలో ప్రభుత్వం తన వాటాను క్రమంగా విక్రయించనుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయినా, ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు 107 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం 

గత ఐదేళ్లలో ప్రభుత్వానికి ఇచ్చింది ఇంత..
Hindustan Zinc: వేదాంత గ్రూప్‌కు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.13,195 కోట్లు జమ చేసింది. ఇది మొత్తం ఆదాయంలో 46 శాతం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు కంపెనీ చేసిన మొత్తం రూ.13,195 కోట్లని హిందుస్థాన్ జింక్ సోమవారం స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. దీంతో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. (HZL) గత ఐదేళ్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.77,803 కోట్లను సమకూర్చింది.

Also Read: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి డబ్బులే డబ్బులు..15 రోజుల్లో..15 లక్షల కోట్లు..! 

వారికి కూడా డబ్బులు..
Hindustan Zinc: హిందుస్థాన్ జింక్ చైర్‌పర్సన్ ప్రియా అగర్వాల్ హెబ్బార్ మాట్లాడుతూ తమ వ్యాపారం పెరిగే కొద్దీ ఈ సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. హిందూస్థాన్ జింక్ వద్ద  మా వాటాదారులందరికీ విలువను సృష్టించే ఉద్దేశ్యంతో , స్థిరమైన, పారదర్శకమైన వ్యాపారాన్ని కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. గత ఐదేళ్లలో, సంస్థ రాయల్టీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF), ఇతర రుసుముల రూపంలో రాజస్థాన్‌కు ఏటా సగటున రూ. 3,250 కోట్లను అందించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి హిందుస్థాన్ జింక్ నిబద్ధతను ఈ ముఖ్యమైన సహకారం ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తిదారుగా ఉంది. అలాగే వెండి ఉత్పత్తిలో మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగానూ ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు