BREAKING: కొడంగల్ లో హైటెన్షన్... అసలు అక్కడ ఏం జరుగుతుంది! కొడంగల్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉప్పల్ కు చెందిన బీఆర్ఎస్ నేత సోమశేఖర్ రెడ్డి తన 100 మంది అనుచరులతో కలిసి కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట్ గ్రామంలో కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. By V.J Reddy 14 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections: మరోసారి కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలపై హైదరాబాద్ కు చెందిన కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సుమారు 100మందికి పైగా తన అనుచరులు స్థానిక కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. విషయం తెలుసుకుని సర్జఖాన్ పేట గ్రామానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ నేతలను చూడటంతో అక్కడి నుండి సోమశేఖర్ రెడ్డి అనుచరులు పారిపోయారు. సోమశేఖర్ రెడ్డి ఎవరు? హైదరాబాద్ ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. ఈయన రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి.. టికెట్ తనకు కాకుండా వేరే అభ్యర్థికి కేటాయించడంతో భంగపడ్డ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ అదికారంలో లేకున్నా.. పార్టీకోసం ఎంతగానో కష్టపడ్డానని.. రేవంత్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని నమ్మించి గొంతు కోశాడని ఆరోపించారు. కొడంగల్ లో ఎట్టిపరిస్థితిలో రేవంత్ రెడ్డి ఓడిస్తానని ప్రకటించారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి గత కొన్ని రోజులు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కొడంగల్ లోనే పర్యటన చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. #telangana-news #telanagana-elections #congress-brs-fight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి