TDP Vs YCP: గుడివాడలో హై టెన్షన్..ఎన్టీయార్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ vs వైసీపీ

గుడివాడలో పొటికల్ గొడవ మొదలైంది. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఇద్దరూ ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది.

New Update
TDP Vs YCP: గుడివాడలో హై టెన్షన్..ఎన్టీయార్ వర్ధంతి వేడుకల్లో టీడీపీ vs వైసీపీ

NTR Death Anniversary:గుడివాడలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్ జరిగేలా ఉంది. ఇక్కడి స్థానికి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతీ ఏటా ఎన్టీయార్ వర్ధంతి నిర్వహిస్తారు. నాని ఎన్టీయార్‌కు శిష్యుడు. ఈ ఏడాది కూడా ఆనవాయితీ ప్రకారం కొడాలి నాని వర్ధంతి కార్యక్రమాల్ని ఏర్పాటు చేవాడు. అయితే ఈ సారి టీడీపీ కూడా ఇక్కడే ఎన్నటీయార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గుడివాడలో ఉన్న ఎన్టీయార్ విగ్రహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు ఇలా ఒకే కార్యక్రమం కోసం పోటీ పడుతుండడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. ఏమైనా గొడవలు జరుగుతాయా అనే హై టెన్షన్‌కు దారి తీస్తోంది.

Also read:ఇరాన్ మీద పాకిస్తాన్ ప్రతీకార చర్యలు

టీడీపీ రా కదలి రా సభ...
ఈరోజు సీనియర్నటుడు ఎన్టీయార్ వర్ధంతి. ఈసందర్భంగా నేడు గుడివాడలో చంద్రబాబు పర్యటించనున్నారు. మద్యాహ్నం 3 గ.లకు నిమ్మకూరులో ఎన్టీఆర్ , బసవతారకం విగ్రహాలకు చంద్రబాబు దంపతులు నివాళుర్పించనున్నారు. తరువాత గుడివాడలోని ముదినేపల్లిరోడ్ లో జరగనున్న రా కదలిరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా టీడీపీ శరేషులు భారీ ఏర్పాట్లు చేశారు. ఊరంతా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో ముదినేపల్లి రోడ్డు పసుపు వర్ణంగా మారిపోయింది.

కొడాలి నాని ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు..
మరోవైపు టీడీపీకి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ టూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో 300 బైకులతో ర్యాలి , 10 వేలమందికి అన్నదానం కార్యక్రమం చేయనున్నారు నాని. ఇందుకు సంబంధించి పట్టణ ప్రధాన రహదారులపై టీడీపీ బ్యానర్లకు పోటీగా, సీఎం వైఎస్‌ జగన్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు టీడీపీ...మరోవైపు వైసీపీ ఫ్లెక్సీలతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఇటీవల వంగవీటిరంగా వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ వర్గాలు గొడవ చేవాయి. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ముందుగానే అక్కడ భారీ బందోస్తును ఏర్పాటు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment