TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు

దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఎదురుపడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు.

New Update
TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు

High Tension in Denduluru: దేశ వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు హట్‌ హట్‌ గా మారాయి. గురువారం దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం నుంచి పెదవేగి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి 10 గంటల తరువాత టీడీపీ, జనసేన కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. విజయరాయి గ్రామానికి చేరుకునే సరికి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు ఎదురు పడ్డారు.

ఈ క్రమంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) కార్యకర్తల మధ్య ఒక్కసారిగా మాటల యుద్దం మొదలైంది. ఆ మాటల యుద్దం కాస్త ఘర్షణకు దారి తీసింది.
దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడిన కార్యకర్తలను వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం గురించి ముందుగానే బయల్దేరిన చింతమనేనికి తెలిసింది.

దీంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే పోలీసులు వైసీపీ వారికి కొమ్ము కాస్తూ చూస్తుండిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్థరాత్రి నడిరోడ్డు పై కూర్చొని చింతమనేని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు దాడులకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో చింతమనేని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) మాట్లాడుతూ..శాంతియుతంగా ప్రచారం చేసుకుంటున్న మా మీద, మా కార్యకర్తల మీద ఉద్దేశ పూర్వకంగా దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరుగా విధ్వంసం సృష్టిస్తే మాత్రం తప్పు చేసిన వారు తప్పకుండా ఫలితాలు అనుభవించి తీరుతారని చింతమనేని అన్నారు.

దాడులు చేయటం గొప్ప కాదు..ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి...దమ్ముంటే ప్రజల అభిమానం పొంది గెలిచి చూపించాలని చింతమనేని సవాల్‌ చేశారు. వైసీపీ నీచమైన రాజకీయానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ మూకల దాడిలో మా కార్యకర్త పర్వతనేని ప్రభాకర్ కి తల పగిలింది, కుట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయటం హేయమైన చర్య అని చింతమనేని అన్నారు.

Also Read: అర్జున్ బెరడు ఈ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించాలో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు