Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 24 Aug 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Nagarjuna: తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్ లోని తన N కన్వెన్షన్ హైడ్రా అధికారులు కూల్చివేయడాన్ని ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. నాగార్జున వేసిన పిటిషన్ కు అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతపై స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈరోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేతను ప్రారంభించారు. నేడు కబ్జా చేయలేదు: నాగార్జున తాను చెరువును ఆక్రమించానని చెప్పి హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంపై హీరో నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఎక్స్‌లో.. " స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు. #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి