Skill Development Scam Case:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు కూడా స్పష్టం చేశారు. అనంతరం తరువాత విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. By Manogna alamuru 13 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Undavalli Petition on Skill Development Case : స్కిల్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి కోరారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఏజీ కోర్టు (ACB Court) కు నివేదించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. స్కిల్ స్కాం విచారణ సీఐడీ నుంచి..సీబీఐకు ఇవ్వాలని రిట్ పిటిషన్ లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్ స్కాం నిందితులందరినీ ఉండవల్లి పిటిషన్ లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. దీంతో, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు (Chandrababu), అచ్చెన్నాయుడుతో సహా 44 మందికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణలో ఉంది. ఈ సమయంలో హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ఈ నెల 17న విచారణకు రానుంది. Also Read:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ #chandrababu #chandrababu-arrest #undavalli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి