KTR: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్! మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. By V.J Reddy 15 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KTR Bail Petition: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, పార్టీ నేతల ఫిరాయింపుల, కూతురు కవిత అరెస్ట్ తో సతమతమవుతున్న కేసీఆర్ కు మరో సమస్య ఎదురుకానుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా మేడిగడ్డ బ్యారేజీపై (Medigadda Barrage) అనుమతి లేకుండా డ్రోన్ (Drone) ఎగురవేశారని కేటీఆర్‌తో సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మేడిగడ్డపై అపోహలు వద్దని.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓటమికి ఒక కారణమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుకుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు (Kaleshwaram Project) కూడా వరద భారీగా చేరుకుంది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విఫలమైందని.. ఇక పని చేయదని ఆనాడు ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేశాయి. ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన ఆరోపణలను తప్పు అని నిరూపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ (KTR) అధ్యక్షతన కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ క్రమంలో ప్రజలకు ప్రాజెక్ట్ ను చూపించేందుకు డ్రోన్ ఎగరవేశారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్ తో సహా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: హైదరాబాద్ లో ఆ 56 చెరువులు మాయం.. ఎక్కడెక్కడ ఎంత మింగారంటే? రేవంత్.. రివెంజ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డ్రోన్ ఎగరవేశారు. నదిని ఆక్రమించి హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ ఇల్లీగల్ గా డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రేవంత్ ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. సీఎం హోదాలో రేవంత్ ఉండదంతో కేటీఆర్ పై ఆయన రివెంజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే డ్రోన్ కేసు తరహాలో కేటీఆర్ ను కూడా జైలు జీవితం అనుభవించేలా రేవంత్ కార్యాచరణ చేపట్టారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా? లేదా?అనేది వేచి చూడాలి. #ktr #telangana-news #kaleshwaram-project #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి