Rakul Preeth Wedding Video: వావ్..! సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఫిబ్రవరి 21న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. సినిమాను మించిపోయేలా స్టన్నింగ్ విజువల్స్ తో వీరి పెళ్లి వీడియో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

New Update
Rakul Preeth Wedding Video: వావ్..!  సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Rakul Preeth - Jackky Bhagnani Wedding Video: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నెల ఫిబ్రవరి 21న నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ఈమె వివాహం ఘనంగా జరిగింది. గోవాలోని ఐటీసీ గ్రాండ్ (ITC Grand Goa) రిసార్ట్ లో జరిగిన రకుల్, జాకీ పెళ్లి వేడుకలకు ఇరు కుటుంబ, సభ్యులు, బంధువులు, పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో శిల్పా శెట్టి, అనన్య పాండే, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ కొత్త జంటకు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కూడా రకుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా రకుల్ షేర్ చేసిన ఆమె పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన విజువల్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది.

Also Read: Director Yashasvi: ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

publive-image

రకుల్ పెళ్లి వీడియో

సినిమాను మించిపోయేలా భారీగా రకుల్ వెడ్డింగ్ వీడియోను షూట్ చేశారు. స్టన్నింగ్ లొకేషన్స్, విజువల్స్ వీడియో కళ్ళు చెదిరేలా ఉంది. ఈ వీడియోలో రకుల్- జాకీ, కుటుంబ సభ్యులంతా సందడిగా కనిపించారు. హెవీ వర్క్ పీచ్ కలర్ లెహంగాలో రకుల్ ఎంట్రీ, డాన్స్ తో వెల్కమ్ చెప్తున్న జాకీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక సినిమా సాంగ్ ను మించిపోయేలా అద్భుతంగా ఉన్నాయి. హల్దీ, సంగీత్, మెహందీ, పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్నీ విజువల్స్ ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. రకుల్ పెళ్లి వీడియో చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇక ప్రస్తుతం రకుల్ మూవీస్ విషయానికి వస్తే.. తమిళ్ లో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఫీమేల్ లీడ్ గా చేస్తోంది. హిందీలో రీమేక్ చిత్రం 'మేరీ పత్నీ కా' సినిమాలో నటిస్తోంది. తెలుగులో రకుల్ చేసిన లాస్ట్ మూవీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Advertisment
Advertisment
తాజా కథనాలు