Aadhi Pinisetty: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో! ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. దానికి కారణం ఆమె తన ఇన్ స్టా లో పెట్టిన ఫోటోలే. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. By Bhavana 04 Apr 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Aadhi Pinisetty - Nikki Galrani: ఒక వి చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటుడు ఆది పినిశెట్టి. రవిరాజా పినిశెట్టి కుమారుడు అయినప్పటికీ ఆయనకు కెరీర్ ఏమి అంత బాగా సాగలేదు. హీరోగా నటించిన సినిమాలు ఏవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్లు సాధించలేదు. దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆది... సరైనోడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో అతను పండించిన విలనిజం... నిజంగానే ఆదిని ఓ రేంజ్ లో నిలబెట్టాయి. హీరో కంటే విలనే చాలా బాగున్నాడు అనే స్థాయికి తెచ్చుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇక అక్కడ నుంచి ఆది వెనుదిరిగి చూడలేదు. కెరీర్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుంది. View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే తనతో పాటు నటించిన నటి నిక్కీ గల్రానిని(Niccky Galrani) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిక్కీ కూడా మలయాళ, తమిళ, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాలు చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత నిక్కీ పూర్తిగా సినిమాలకు దూరమైంది. తాజాగా, నిక్కీ తల్లి కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో నిక్కీ తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఇక అందులో ఆమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో నిక్కీ ప్రెగ్నెంట్ తన బేబీ బంప్ క్లియర్గా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఈ ఫొటోలు షేర్ చేసి హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. కొందరు వారిద్దరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. Also read: మీరు యాపిల్ వాడుతున్నారా.. అయితే హై రిస్క్ లో ఉన్నట్లే! #baby-bump #adi-pinisetty #aadhi-pinisetty #nikki-galrani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి