Vijay Devarakonda: మృణాల్, విజయ్ హొలీ సెలెబ్రేషన్స్.. వైరలవుతున్న వీడియో..!

విజయ్ దేవకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. నేడు హొలీ సందర్భంగా సినిమాలోని థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజయ్, మృణాల్ ఫ్యాన్స్ తో కలిసి హొలీ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.

New Update
Vijay Devarakonda: మృణాల్, విజయ్ హొలీ సెలెబ్రేషన్స్.. వైరలవుతున్న వీడియో..!

Vijay Devarakonda: పరుశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్. 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు చిత్ర బృందం.

Also Read: Barrelakka pre wedding Video: బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్.. శిరీష భర్త ఎలా ఉన్నాడో మీరే చూడండి!

మృణాల్, విజయ్ హొలీ సెలెబ్రేషన్స్

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమాలోని థర్డ్ సాంగ్ "మధురము కదా" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అయితే నేడు హొలీ సందర్భంగా ఈ పాటను ప్రమోట్ చేస్తూ అభిమానులతో కలిసి హొలీ సంబరాలు జరుపుకున్నారు మృణాల్, విజయ్. సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వేడుకల్లో హీరో, హీరోయిన్ తో పాటు నిర్మాత దిల్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

publive-image

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మార్చి 28న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ రన్ తర్వాత.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.

Suma Kanakala Holi: హోలీ రోజు గుడ్లు, టమోటోలతో.. యాంకర్ సుమ చేసిన పని చూస్తే షాకవుతారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు