Hero Nithin: పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్

హీరో నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నితిన్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ రివీల్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

New Update
Hero Nithin: పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్

Hero Nithin: టాలీవుడ్ హీరో  నితిన్ రీసెంట్ గా 'ఎక్స్ట్రాడినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు నితిన్. అయితే తాజాగా ఈ సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్

మార్చి 30న తన పుట్టినరోజు సందర్భంగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘చేతిలో శూలంతో ఓ బస్సుపై కూర్చొని సరి కొత్త లుక్ లో కనిపించారు నితిన్. రొటీన్ కు భిన్నంగా వేణు శ్రీరామ్ ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

‘రాబిన్‌‌హుడ్‌‌’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

ఈ మూవీ అప్డేట్ తో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘రాబిన్‌‌హుడ్‌‌’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ ఏజెంట్‌‌ లుక్‌‌లో స్టైలిష్ గా కనిపించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందించగా .. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Arya Movie Re-release: ఫీల్ మై లవ్.. బన్ని ఫ్యాన్స్ కు బంపర్ న్యూస్..’ఆర్య’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు