హీరో మహేష్‌ను మించిన తార.. సితార.. హీరో మహేష్ బాబు కూతురు సితార ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పుల్ పాపులర్టీని సొంతం చేసుకుంది. తనకు ఇన్‌స్టాలో దాదాపు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సితార డ్యాన్సింగ్ వీడియోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తను తొలిసారిగా ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌పై ఈ ప్రకటనని ప్రదర్శించడం విశేషం. By Shareef Pasha 05 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి బహుశా.. మహేష్ బాబు తొలి సినిమాకి కూడా ఇంత పారితోషికాన్ని తీసుకొని ఉండడు. నిజానికి సితారకు ఇప్పుడే కాదు.. ఇది వరకే చాలా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. కోరినంత పారితోషికం ఇస్తామని, కమర్షియల్స్‌లో చేయమని చాలామంది యాడ్ మేకర్స్ అడిగారు. కానీ.. మహేష్ ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఎందుకో ఒకే అన్నాడు. దానికి తగ్గట్టే.. ప్రతిష్టాత్మక టైమ్ స్వ్కేర్‌పై సితార మెరిసింది. ఈ మూమెంట్స్‌ని సితారతో పాటు మహేష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టైమ్స్ స్వ్కేర్నే వెలిగిస్తున్నావు. ఇలానే కొనసాగించంటూ మహేష్ ట్వీట్ చేశాడు. తొలి యాడ్‌తోనే ఇంటర్నేషనల్ బ్రాండింగ్ సంపాదించేంత స్థాయికి ఎదిగిపోయింది సితార. దీనికోసం సితార తీసుకున్న పారితోషికం కోటి రూపాయలు ఓ సెలబ్రెటీ వారసురాలుగా సితార అందుకొన్న తొలి పారితోషికం కూడా ఇదే. దీంతో మహేష్‌బాబు ఇంట్లో త్వరలోనే ఓ సెలబ్రెటీ రాబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన ముద్దుల కూతురు సంపాదించిన ఫస్ట్ రెమ్యునరేషన్‌పై మహేష్‌బాబు ఇప్పటికే ఆనందంతో మునిగి తేలుతున్నాడు. త్వరలోనే తానతో పాటు తన కూతురు సైతం తెరమీద కనిపించాలని మహేష్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాదు తన కూతురుని అందరూ ఇలాగే ఆదరించాలని మహేష్ అభిప్రాయపడ్డారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి