Viral News: నువ్వు దేవుడివి సామీ.. 97 వేల కోట్ల ఆస్తి పని మనిషికి రాసిచ్చేశాడు..! లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హెర్మ్స్ వ్యవస్థాపకుడు థైరీ హెర్మ్స్ మనువడు నికోలస్ ప్యూచ్ తన ఆస్తినంతా మాజీ తోటమాలి పేరిట రాసిచ్చేస్తున్నారు. ఆయన్ను దత్తత తీసుకుని తన పేరిట ఉన్న రూ. 97 వేల కోట్ల ఆస్తిని ఆయనకు అప్పగిస్తున్నారు. By Shiva.K 10 Dec 2023 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Hermes heir: ఆయనో బిలియనీర్.. ప్రపంచంలో మంచి గుర్తింపు ఉన్న ధనవంతుడు. కోటాను కోట్ల ఆస్తి ఆయన సొంతం. కానీ, ఆయనకు సంతానం లేదు. అందుకే.. ఈ అస్తినంతా ఏం చేయాలో అర్థం కాక.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో తన తోటమాలిని దత్తత తీసుకుని.. ఆస్తిని అప్పగించాలని నిర్ణయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1100 కోట్ల డాలర్ల సంపద(భారత కరెన్సీలో రూ. 97 వేల కోట్లు) అప్పగించాలని ఫిక్స్ అయ్యారు. మరి ఇంత సంచలన నిర్ణయం తీసుకున్న ఆ బిలియనీర్ ఎవరో ఓసారి చూద్దాం.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బిలియనీర్, లగ్జరీ ఫ్యాషన్ హౌస్ హెర్మ్స్ వ్యవస్థాపకుడు థైరీ హెర్మ్స్ మనువడు నికోలస్ ప్యూచ్.. ఈ నిర్ణయం తీసుకున్నారు. నికోలస్ ప్యూచ్(80) అవివాహితుడు. దాంతో ఆయనకు వారసుడు లేడు. అయితే, తన అనంతరం వేల కోట్ల ఆస్తిని ఎవరికైనా అప్పగించాలని భావించారు. ఈ క్రమంలోనే 51 ఏళ్ల మాజీ తోటమాలిని దత్తత తీసుకున్నాడు నికోలస్. తనకు వాటాగా వచ్చిన ఆస్తికి వారసుడిగా అతన్ని ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి న్యాయ ప్రక్రియ కూడా ప్రారంభమైందని స్విస్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. అంతేకాదు.. పలు ప్రాంతాల్లో తన పేరిట ఉన్న విలువైన భవంతులు, ఆస్తులను సదరు తోటమాలి పేరిట మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా.. ఆ తోటమాలి మాత్రం నిజంగా అదృష్టవంతుడే అని చెప్పుకోవాలి. Also Read: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి #hermes-heir #hermes-heir-property మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి