AP: తూ.గో జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. ఆ గ్రామాలకు స్తంభించిన రవాణా వ్యవస్థ..!

ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.

New Update
AP: తూ.గో జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. ఆ గ్రామాలకు స్తంభించిన రవాణా వ్యవస్థ..!

East Godavari: ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం తడిసిముద్దవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. వర్షాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కోమరవరం వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో రంపచోడవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.వీకెండ్ కావడంతో ఏజెన్సీ వైపు భారీగా వెళ్తున్న పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Also Read: భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!

రంపచోడవరం-గోకవరం వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. దేవీపట్నం మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందుకూరుపేట-పోచమ్మ గండి వైపు వెళ్లే రహదారిపై పెద్ద కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. గోకవరం సమీపంలోని కొత్తూరు వద్ద కొండ కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. గంగవరం మండలం నెల్లిపూడి వద్ద ఊరకాలువ పొంగిపొర్లడంతో గోకవరం-అడ్డతీగల వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. నెల్లిపూడి ఊర కాలువ వద్ద బైక్‌తో పాటు ఓ యువకుడు గల్లంతైనట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు