RAINS: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది.

New Update
Telangana Weather: తెలంగాణకు వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిలింగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌, షేక్‌పేట్, మణికొండ, రాయదుర్గం, మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. వర్షం ప్రభావంతో నగరంలోని పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వచ్చింది.

దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కావండతో పలు చోట్ల స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్నిరోజులగా ఉక్కపోతతో బాధపడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. అటు శనివారం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

రానున్న మూడు రోజుల పాటు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు