శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త కూల్ తగిలింది. అంతేకాకుండా అన్నదాతలకు శుభవార్త కూడా చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇలానే మరికొన్ని రోజులు వానలు పడే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పారు. దీంతో రైతలు కరీఫ్ సీజన్‌కు సిద్ధమయ్యారు.

New Update
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

It is raining all over Srikakulam districtచిరు జల్లులతో ఊరట

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించటంతో వర్షాలు పడుతున్నాయి. వీటికి తోడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఫలితంగా మొన్నటి వరకు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండల పని అయిపోయింది. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తునే ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర పదేశ్‌ వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక బుధవారం ఎగువ రాష్ట్రం ఒడిషాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. భానుడి భగభగలతో గత కొన్ని రోజులుగా అల్లడిన జనంకి చిరు జల్లులతో ఊరట కలిగింది.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

రాష్ట్రంలో అప్రమత్తమై జిల్లా యంత్రాంగం, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉషోగ్రతలు తారాస్థాయికి చేరాయి. అంతే కాకూండా జూన్ నేల ప్రారంభం నాటికి రావాలసిన రుతుపవనాలు ఆలస్యం కావడంతో జూన్ నేలలో కూడా ఎండలు దంచిగొట్టడంతో ప్రజలు విలవిలలాడిపోయారు. అయితే జూన్‌ల్లో సైతం మే నేల లాగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన ఏళ్లలో ఇటువంటి ఉష్టోగ్రతలు ఎన్నడూ లేవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను ఆదేశించిన జిల్లా యంత్రాంగం.

Advertisment
Advertisment
తాజా కథనాలు