Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..! భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్‌పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. By Jyoshna Sappogula 07 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Traffic Jam Due To Heavy Rain Fall in Hyderabad: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్‌పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా వాహనాలు రోడ్లపై భారీగా నిలిచిపోయాయి. Also Read: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..! దుర్గం చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ#HyderabadRains #Traffic #Hyderabad #ITCorridor #Durgamcheruvu pic.twitter.com/wJzAp4n9dJ — ChotaNews (@ChotaNewsTelugu) May 7, 2024 పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావాడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. Hyderabad Raine :హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. #HyderabadRains #WeatherUpdate #Hyderabad #HeavyRain #rtvnews #rtv pic.twitter.com/IOsAX40ORm — RTV (@RTVnewsnetwork) May 7, 2024 సికింద్రాబాద్‌లో 8.4 సెంటీమీటర్లు.. KPHBలో 7, గాజులరామారంలో 4 సె.మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షం కారణంగా మెట్రో సేవలకు సైతం అంతరాయం కలుగుతోంది. అయితే తాజాగా, నిఖిల్ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన వీడియోను పోస్ట్ చేస్తూ.. 'దయచేసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి.. ఇది కేవలం వేసవి వర్షం. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.. ట్రాఫిక్ నిలిచిపోయింది. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి పరిస్థితి అద్వనంగా ఉంది. అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు' అని ట్విట్ చేశారు. Dear @revanth_anumula sir, please find solution for this it's just a summers rain. The roads are filled with water and traffic is stucked and most of the people are traveling through bikes are facing worse situations and even there no way ambulance. @GHMCOnline #Hyderabad pic.twitter.com/3oOmx6s4Sj — Nikhil (@Nameesnikhil) May 7, 2024 హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు #HyderabadRains #HeavyRain #roadblock #Heavy #traffic #rtvnews #rtv pic.twitter.com/GTG3uSr2yw — RTV (@RTVnewsnetwork) May 7, 2024 #heavy-rain #hyderabad-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి