Andhra Pradesh : ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Andhra Pradesh : ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

AP Rain Alert : ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏపీ (AP) అతలాకుతలం అవుతోంది. విజయవాడ వాసులు ఇంకా పూర్తిగా వరద ముప్పు నుంచి తేరుకోకముందే...వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఎండీ కేవీఎస్ శ్రీనివాస్ ప్రకటించారు. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.

గత కొద్ది రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడ (Vijayawada) లో బుడమేరు కాల్వ పొంగడంతో నగరం మునిగిపోయింది. దీంతో చాలా మంది ఇళ్లు మునిగిపోయి. పరిస్థితులు కొంచెం సద్దుమణుగుతున్న తరుణంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. మరోసారి భారీ వర్షాలు కురిస్తే.. ప్రజలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Also Read: విజయవాడలో ఇన్యూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు