బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను వచ్చే ఛాన్స్? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యాకారులు ఈ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. By srinivas 26 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Heavy Rain Alert: భారత వాతావరణ శాఖ మరో చల్ల కబురు అందించింది. రానున్న రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు దీని ప్రభావంతో తుఫాను కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాల ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రాలైన ఏపీ (AP), తమిళనాడు, కేరళ సహా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో గత వారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్‌లాండ్ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్ దిశగా పయనించే సమయంలో తుఫాన్ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించి, బలహీన పడుతుందని చెప్పింది. ఈ తుఫాను దక్షిణ కోస్తా... తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో నవంబరు 26 నుంచి 28 వరకూ అండమాన్ నికోబార్ దీవుల్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న అండమాన సముద్రంలో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యాకారులు నవంబరు 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. Also read : ఛీ.. మరీ ఇంత దారుణమా.. మళ్లీ రిపీటైతే ఊరుకోను: పరిణీతి ఫైర్ అతాగే గడిచిన గత 24 గంటల్లో అధికంగా అడయారులో 72 మి.మీ. వర్షపాతం, పెరుంగుడిలో 44 మి.మీ., ఆలందూర్‌లో 37 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో చెన్నై సహా పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోగా స్థానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నూ ఈ అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొతకు వచ్చిన వరిచేను నెలకొరిగిపోవడంతోపాటు కోసిన ధాన్యం తడిచిపోతుందని ఆవేదన చెందుతున్నారు. #india #heavy-rain-alert #weather-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి